https://oktelugu.com/

Chanakya Nithi: చాణక్య నీతి ప్రకారం లక్ష్మి దేవి అనుగ్రహం కోసం పాటించాలని చెప్పిన 5 నీతి సూత్రాలివే..!

Chanakya Nithi: ఆచార్య చాణక్యుడు మేధావిగా, ఆర్థిక వేత్తగా, వ్యూహకర్తగా పేరుప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. చాణక్యుడు డబ్బుకు సంబంధించి మనుషులు ఏ విధంగా వ్యవహరించాలో కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ డబ్బు ఎంతో ముఖ్యం కాగా ఎవరైతే తెలివిగా సంపాదిస్తారో వాళ్ల దగ్గర మాత్రమే డబ్బు ఉంటుంది. డబ్బును కలిగి ఉన్నవాళ్లు కొన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడే ఛాన్స్ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబంపై ఉండాలంటే కొన్ని నియమనిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. చాణక్యుడు వృథా ఖర్చులకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 27, 2022 / 10:34 AM IST
    Follow us on

    Chanakya Nithi: ఆచార్య చాణక్యుడు మేధావిగా, ఆర్థిక వేత్తగా, వ్యూహకర్తగా పేరుప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. చాణక్యుడు డబ్బుకు సంబంధించి మనుషులు ఏ విధంగా వ్యవహరించాలో కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ డబ్బు ఎంతో ముఖ్యం కాగా ఎవరైతే తెలివిగా సంపాదిస్తారో వాళ్ల దగ్గర మాత్రమే డబ్బు ఉంటుంది. డబ్బును కలిగి ఉన్నవాళ్లు కొన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడే ఛాన్స్ ఉంటుంది.

    Chanakya Nithi

    లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబంపై ఉండాలంటే కొన్ని నియమనిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. చాణక్యుడు వృథా ఖర్చులకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు. ఎవరైతే అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వాళ్లపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని గుర్తు పెట్టుకోవాలి. దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ సంపాదనకు అనుగుణంగా బడ్జెట్ వేసి ఖర్చు పెట్టేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

    Also Read: Bangaru Telangana: తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?

    ఆచార్య చాణక్యుడు కష్టపడి పని చేయడానికి అస్సలు భయపడకూడదని ఎవరైతే తీవ్రంగా శ్రమించి మంచి ఫలితాలను కోరుకుంటారో వాళ్లపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చాణక్యుడు పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటూ వాళ్లు సంతోషంగా ఉంటే మాత్రమే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుంది. అలా కాకుండా నిత్యం గొడవలు పడే కుటుంబంలో లక్ష్మీదేవి ఉండదని గుర్తుంచుకోవాలి.

    అవసరమైన వ్యక్తికి సహాయం చేసి కష్టాల నుంచి గట్టెక్కించడంలో ముందువరసలో ఉండాలి. ఇలా సహాయం చేసే గుణం కలిగి ఉండేవాళ్లపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇలాంటి వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోరు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వల్ల ఎలాంటి సమస్యలను అయినా సులభంగా అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుంది.

    Also Read: Vacancies In AP Govt Hospital: ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.52 వేల వేతనంతో?