https://oktelugu.com/

Manchu Brothers Tweeted RRR Movie: RRR పై మంచు మనోజ్ వెరైటీ ట్వీట్ ! ఏం సినిమా రా అయ్యా అంటూ…

Manchu Brothers Tweeted RRR Movie: బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్.ఆర్.ఆర్. రామ్ చ‌రణ్‌, ఎన్టీఆర్ వంటి ఇద్ద‌రు స్టార్ హీరోలు ఈ సినిమా కోసం ప‌ని చేశారు. ఈ నేప‌థ్యంలో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. పాన్ ఇండియా మూవీ అయినా పాన్ వరల్డ్ సినిమా అంత క్రేజ్ ఈ మూవీ సంపాదించుకుంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమాను థియేటర్లకు వెళ్లి వీక్షిస్తున్నారు. ఈ మూవీలో […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 27, 2022 / 10:57 AM IST
    Follow us on

    Manchu Brothers Tweeted RRR Movie: బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్.ఆర్.ఆర్. రామ్ చ‌రణ్‌, ఎన్టీఆర్ వంటి ఇద్ద‌రు స్టార్ హీరోలు ఈ సినిమా కోసం ప‌ని చేశారు. ఈ నేప‌థ్యంలో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. పాన్ ఇండియా మూవీ అయినా పాన్ వరల్డ్ సినిమా అంత క్రేజ్ ఈ మూవీ సంపాదించుకుంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమాను థియేటర్లకు వెళ్లి వీక్షిస్తున్నారు.

    Manchu Brothers Tweeted RRR Movie

    ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. చరిత్ర‌లో క‌లుసుకోని ఇద్ద‌రు యోధుల పేర్లను సినిమాలో వాడుకుని వాళ్లిద్దరి మధ్య స్నేహం చిగురింపచేశాడు మన జక్కన్న. అంతేకాకుండా వాళ్లిద్దరూ కలిసి బ్రిటీష్ సైన్యంపై ఎలా దాడి చేశారు.. వాళ్ల అంతిమ లక్ష్యం ఆధారంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కించాడు.

    Also Read: Ram Charan Birthday Special: చరణ్ బర్త్ డే స్పెషల్.. చెర్రీ ఎప్పటికీ ప్రత్యేకమే

    తాజాగా మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌ ఈ సినిమాను వీక్షించారు. అనంతరం ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ చాలా గొప్ప సినిమా అని.. జక్కన్న ఈ మూవీని ఎంతో చక్కగా మలిచారని.. ప్రతి ఫ్రేమ్‌ను తాను ఎంతో ఎంజాయ్ చేశానని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఈ మూవీలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ నటన అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఈ సినిమా విజువల్ వండర్ ట్రీట్ అని.. ఇంత గొప్ప సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్యకు ధన్యవాదాలు తెలిపాడు. కీరవాణి గారు ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారని ఫైర్ ఎమోజీని షేర్ చేశాడు.

    Manchu Brothers Tweeted RRR Movie

    మరోవైపు ఆర్.ఆర్.ఆర్ సినిమా చూశానని.. తెలుగు సినిమాకు ఇది ఎంత గొప్ప సమయమో ఈ మూవీ చాటి చెప్పిందని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఇంతటి గొప్ప మూవీ తీసిన రాజమౌళి గారికి, తన సోద‌రులు తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఆర్.ఆర్.ఆర్ టీమ్‌కు అభినంద‌న‌లు తెలిపాడు.

    Also Read: RRR 2nd Day Collections: రెండో రోజూ విశ్వ ప్రభంజన విజృంభణే

    Tags