https://oktelugu.com/

 Chanakya Niti:  చాణక్య నీతి ప్రకారం ఈ 5 సూత్రాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమేనట!

Chanakya Niti:  ఆచార్య చాణక్యుడు మనం నిత్య జీవితంలో సంతోషంగా జీవనం సాగించడానికి ఎన్నో సూచనలు చేశారు. నీతి శాస్త్రం ద్వారా నిత్య జీవితంలో ఎలాంటి అలవాట్లను కలిగి ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చాణక్యుడు వెల్లడించారు. ఆచార్య చాణక్యుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమనిబంధనలను పాటించాలని సూచనలు చేశారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం అనవసరమైన వాటి కోసం డబ్బులను ఖర్చు చేయకూడదు.   మన సంపాదనకు అనుగుణంగా ఖర్చు చేయడంతో పాటు సంపాదించిన డబ్బులో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 22, 2022 / 10:23 AM IST
    Follow us on

    Chanakya Niti:  ఆచార్య చాణక్యుడు మనం నిత్య జీవితంలో సంతోషంగా జీవనం సాగించడానికి ఎన్నో సూచనలు చేశారు. నీతి శాస్త్రం ద్వారా నిత్య జీవితంలో ఎలాంటి అలవాట్లను కలిగి ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చాణక్యుడు వెల్లడించారు. ఆచార్య చాణక్యుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమనిబంధనలను పాటించాలని సూచనలు చేశారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం అనవసరమైన వాటి కోసం డబ్బులను ఖర్చు చేయకూడదు.

    Chanakya Niti

     

    మన సంపాదనకు అనుగుణంగా ఖర్చు చేయడంతో పాటు సంపాదించిన డబ్బులో కొంత మొతాన్ని పొదుపు చేయాలి. ఎవరైతే డబ్బులను వృథాగా ఖర్చు చేస్తూ విలాసాలకు ప్రాధాన్యత ఇస్తారో వాళ్లపై లక్ష్మీదేవి అగ్రహంగా ఉంటుంది. చాణక్యుడు చెప్పిన వివరాల ప్రకారం పని చేయడానికి అస్సలు భయపడకూడదు. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్లపై లక్ష్మీదేవి కరుణ ఉంటుంది.

    Chanakya Niti

    శ్రమించి పని చేసేవాళ్లకు ఏదో ఒకరోజు వాళ్ల కష్టానికి మించి డబ్బులు సొంతమవుతాయని చెప్పవచ్చు. చాణక్యుడు చెప్పిన వివరాల ప్రకారం ఏ కుటుంబం అయితే సంతోషంతో ఉంటుందో ఆ కుటుంబంలో లక్ష్మీదేవి ఉంటుంది. నిత్యం మనస్పర్ధలతో జీవనం సాగిస్తుంటే మాత్రం లక్ష్మీదేవి కరుణ మనపై ఉండదని గుర్తుంచుకోవాలి. చాణక్యుడు నీతిశాస్త్రం ద్వారా ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలని సూచించారు.

    Also read: చాణక్య నీతి ప్రకారం ఈ అలవాట్లు మీకు ఉంటే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే?

    ఇతరులు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకుంటే లక్ష్మీదేవి మనల్ని కరుణించడంతో పాటు జీవితాంతం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ సూచనలను పాటించే వాళ్లకు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని భావించే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

    Also Read: పెళ్లి అంటూ చేసుకుంటే ఈ రాశుల వారినే చేసుకోవాలి.. ఎందుకో తెలుసా

    Recommended Video: