Aare Donda: పూర్వకాలంలో మన వారు అన్ని ఆకులు, కాయలు తినేవారు. దీంతో రోగాలు రాకుండా ఉండేవి. ఈ క్రమంలో వారికి వందేళ్లు వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేవి కావు. పైగా ఇప్పటి ఆహార అలవాట్లతో మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అప్పటి వారికి ఇలాంటి సమస్యలు వచ్చేవి కావు. ఏది తిన్నా వారు సహజసిద్ధంగా తినేవారు. ఇప్పుడు అంత విషతుల్యంగా మారింది. ఈ నేపథ్యంలో మనకు అడవుల్లో ఎక్కువగా కనిపించే అర దొండ గురించి తెలుసుకుందాం.
దీన్ని అరదొండ ఆ దొండ, ఆరు దొండ, గోవింద అనే పేర్లతో పిలుస్తారు. ఇది కాపరేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం కాపారేసి జియానికా అంటారు. ఆంగ్లంలో ఇండియన్ క్లీపర్, సిలోన్ కీపర్ అనే పేర్లతో పిలుస్తారు. దీనిలో ఔషధ గుణాలు మెండు. పలు రకాల వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెంచడంలో సాయపడుతుంది.
ఈ చెట్టుకు ఉండే పువ్వుల రేకులు సూర్య కిరణాలుగా కనిపిస్తాయి. దీంతో దీన్ని సూర్య కాంతి పువ్వు అని కూడా అంటారు. ఈ కాయలు చిన్నగా గుండ్రంగా ఉంటాయి. బయట పచ్చని రంగు కలిగి ఉంటాయి. లోపల తెల్ల రంగుతో కనిపిస్తాయి. కీళ్లనొప్పులు, నడుం నొప్పులు వంటి వాటికి పరిష్కారం చూపిస్తుంది. దీని బెరడు ముద్దగా నూరి తేలు, పాము కాటుకు మందులా ఉపయోగిస్తారు.
తామర సమస్యలు తగ్గాలంటే స్నానం చేసే నీటిలో దీని ఆకులు వేసుకుని చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. దీని ఆకులను కషాయంగా తాగితే నులిపురుగులు మాయం అవుతాయి. దీని కూరను తరచుగా తింటుంటే షుగర్ వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది. దీని కాయలు మితంగా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ కరిగిస్తాయి. దీని ఆకులను నీటిలో వేసి మరిగించి స్నానం చేయడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. దీని కాయలను మెత్తగా పేస్టులా చేసి మొలలు ఉన్నచోట రాస్తే వెంటనే పరిష్కారం దొరుకుతుంది.