Migraine: ఈ రోజుల్లో వ్యాధులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇక ఒకప్పుడు కేవలం తలనొప్పి మాత్రమే వచ్చేది. కాస్త జెండా బాంబ్ రాస్తే తగ్గిపోయేది. ఎక్కువగా ఉంటే ఓ మాత్ర వేసుకుంటే సరిపోయేది. కానీ ప్రస్తుతం మాత్రం మైగ్రేన్ అంటూ ఇబ్బంది పెడుతుంది ఈ తలనొప్పి. ఇక చాలా వ్యాధులకు మన కిచెన్ లోనే మంత్రం ఉంటుంది. కిచెన్ లో లభించే చాలా వస్తువులు, పదార్థాలు చాలా జబ్బులను నయం చేస్తాయి. మరి మైగ్రేన్ కు కూడా మంత్రం ఏమైనా ఉందా? ఎలా తగ్గించుకోవచ్చు? శాశ్వత పరిష్కారం ఉందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం నువ్వులతో తలనొప్పిని మాయం చేసుకోవచ్చు అంటే నమ్ముతారా? అవును కేవలం నువ్వులు చాలు మైగ్రేన్ ను మాయం చేయడానికి అంటారు ఆరోగ్య నిపుణులు. నువ్వులను వేయించి ప్రతిరోజు పరగడుపున అరచెంచా తినాలి. ఈ నువ్వులను తిన్న తర్వాత నీళ్లు తాగితే సరిపోతుంది. ఇలా ఒక 20 రోజులు తినాలి. ఆ తర్వాత 21 రోజులు ఈ నువ్వులను తినకూడదు. మళ్లీ 21 రోజుల తర్వాత నువ్వులను తినాలి. ఇలా మూడు సార్లు చేయాలి.
ఈ చిన్న పనిని ప్రతి రోజు ఉదయం చేస్తే 20 సంవత్సరాల నుంచి వెంటాడుతున్న మైగ్రేన్ కూడా ఇట్టే తగ్గిపోతుంది అంటున్నారు నిపుణులు. దీనికి వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద మందులు తినాల్సిన అవసరం లేదు. కేవలం అర చెంచా నువ్వులను ప్రతి రోజు ఉదయం తింటే సరిపోతుంది. మరి తెలుసుకున్నారు కదా.. ఈ చిన్న టిప్ ను పాటించండి మీ మైగ్రేన్ ను దూరం చేసుకోండి.