దగ్గు తగ్గించే చిట్కాలు

దగ్గు మనతో పాటు పక్క వారికీ కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దగ్గు బాగా రావడం వలన గొంతు నొప్పి ఆయాసం కూడా కలుగుతుంది .. పొడి దగ్గు నివారణ చిట్కాలను కొన్ని తెలుసుకుందాం. 1.కరక్కాయను పగల గొట్టి చిన్ని ముక్కను బుగ్గన ఉంచుకొని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్దీ కొద్దిగా మింగుతూ ఉంటే సాధారణం వచ్చే     దగ్గు తగ్గిపోతుంది. 2. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా యాలుకల పొడి, లవంగాల పొడి కలుపుకొని నెమ్మదిగా తాగితే […]

Written By: admin, Updated On : February 13, 2020 5:34 pm
Follow us on

దగ్గు మనతో పాటు పక్క వారికీ కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దగ్గు బాగా రావడం వలన గొంతు నొప్పి ఆయాసం కూడా కలుగుతుంది ..
పొడి దగ్గు నివారణ చిట్కాలను కొన్ని తెలుసుకుందాం.

1.కరక్కాయను పగల గొట్టి చిన్ని ముక్కను బుగ్గన ఉంచుకొని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్దీ కొద్దిగా మింగుతూ ఉంటే సాధారణం వచ్చే     దగ్గు తగ్గిపోతుంది.

2. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా యాలుకల పొడి, లవంగాల పొడి కలుపుకొని నెమ్మదిగా తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది. ఇలా                  కాకపోయినా లవంగంను నోటిలో ఉంచుకొని చ ప్పరించిన పొడి దగ్గు తగ్గుతుంది.

3. ఒక అరచెంచా అల్లం రసంలో ఒక చెంచా తేనె కలుపుకొని ప్రతి రోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దాని        వలన కలిగే ఆయాసం కూడా తగ్గిపోతుంది.

4. గోరు వెచ్చని పాలలో కొద్దిగా యాలుకల పొడి, మిరియాల పొడి కలుపుకొని రాత్రి పాడుకొనే ముందుగా తాగితే దగ్గు తగ్గి సుఖ                నిద్ర కలుగుతుంది.

5. ఒక స్పూను తులసి ఆకు రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫం వలన వచ్చే దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది.