‘Haddi’ review : నవాజుద్దీన్ సిద్ధిఖీ , అనురాగ్ కశ్యప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హడ్డీ’, ఈ రోజు జీ 5 ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ వరకు మెప్పించిందో తెలుసుకుందాం…మంచి స్క్రిప్ట్ దొరకడం తో నవాజుద్దీన్ సిద్ధిఖీ తనదైన శైలిలో అద్భుతమైన నటన కనబరిచాడు. ‘హడ్డీ’ లో అతని గెటప్ నిజంగా నటన పై అతనికి ఉన్న డెడికేషన్ కు ప్రతీక. మూవీ నుంచి అతను ఫస్ట్ లుక్ బయటికి వచ్చినప్పుడు చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘హడ్డీ’ మూవీ లో హారిక అనే ట్రాన్స్జెండర్ పాత్ర పోషించారు. ఈ మూవీ స్టార్టింగ్ లోనే సమాజంలోని వ్యక్తులు ఎందుకు సమాజం అలాంటి వ్యక్తులను చూసి భయపడుతుంది.. వారి ప్రతీకారం ఎందుకు ప్రమాదకరమైందో.. వివరిస్తారు. అయితే ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు సినిమా కాస్త విచిత్రంగా ఉంటుంది. ఆకాశ సమయం ఓపిక పడితే ఆ తరువాత మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ రెడీగా ఉంటుంది.
సినిమా స్టోరీలో వేగం పెరగడంతోపాటు అసలు ఈ రివెంజ్ డ్రామా ఎందుకు అన్న విషయంపై కాస్త క్లారిటీ వస్తుంది. ఫ్లాష్ ప్యాక్ సీక్వెన్స్ లో స్టార్ట్ అయిన తర్వాత హారిక హడ్డీ గా ఎందుకు మారింది అన్న విషయం అర్థం అవుతుంది. ఈ మూవీలో ముఖ్యంగా హారికగా నవాజుద్దీన్ సిద్ధిఖీ యాక్షన్ అద్భుతంగా ఉంది. దీనితో పాటుగా అనురాగశ్య వంటి ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ సినిమా పూర్తయ్యే వరకు మనల్ని కట్టిపడేస్తుంది.
అయితే ఈ మూవీలో వైలెన్స్ కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. ఎక్కడ చూసినా రక్తపాతం.. కనురెప్ప పాటలో నరికి చంపడం.. ఇలా హత్యలతో సినిమా కాస్త భయంకరంగానే ఉంటుంది. కొన్ని సినిమాలు సైలెంట్ గా వచ్చిన వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది.. ఇది కూడా అలాంటి చిత్రాలలో ఒకటి. కాబట్టి దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఇందులో కొన్ని సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టించి గూస్ బంప్స్ క్రియేట్ చేస్తాయి. ఇందులో ట్రాన్స్ జెండర్ గా..హడ్డి పాత్ర ఎంతో పర్ఫెక్ట్ గా చూపించారు.
నిజంగా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ తో ఒక మూవీని ఇంత అద్భుతంగా తీయాలి అంటే ఆషామాషీ విషయమైతే కాదు. ప్రేమ దగ్గర నుంచి కోపం వరకు.. భయం బాధ దగ్గర నుంచి ఎదురు తిరిగే వరకు.. ప్రతి భావోద్వేగాన్ని ఎంతో పరిపూర్ణంగా ప్రదర్శించారు. ఇందులో ఒక క్రూరమైన రాజకీయ నాయకుడిగా అనురాగ్ కశ్యప్ నటన వేరే లెవెల్ లో ఉంది.
నిజంగా ఆ క్యారెక్టర్ కి అతను తప్ప ఎవరూ జస్టిఫై చేయలేరు అనిపిస్తుంది. క్యారెక్టర్ ని ప్లే చేస్తూ కూడా దానిని ఎంతో ఈజీగా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్రెస్ చేయడం అనురాగ్ కశ్యప్ కే సొంతం. ఈ మూవీ లో అరుణ్,మహ్మద్ జీషన్ అయ్యూబ్ లు పోషించింది చిన్న పాత్ర అయినా ఓవరాల్ స్టోరీ పై దాని ప్రభావం ఎంతో ఉంటుంది. ఇటువంటి కథలు సమాజంలో మన కళ్ళముందే జరుగుతున్న మన కంటికి కనిపించని ఎన్నో సంఘటనలను నేరుగా ప్రశ్నిస్తాయి. ఈ సమాజం అందరి కోసమే అన్న విషయాన్ని పదేపదే గుర్తుచేస్తాయి.
రేటింగ్: 3/5
Web Title: Haddi review nawazuddin siddiqui anurag kashyap revenge drama
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com