
నిండా 34 ఏళ్లు కూడా లేవు. నటనలో మేరునగధీరుడు.. గొప్ప ప్రతిభావంతుడు.. సీరియళ్ల నుంచి సినిమాల స్థాయికి ఎవరి అండాదండా లేకుండా కష్టపడి ఎదిగాడు. ‘ఎంఎస్ ధోని’ బయోపిక్ లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. కానీ ఈ సినీ రాజకీయాలకు 34 ఏళ్లకే బలైపోయాడు. మరో టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ ను తలపించాడు. ఇంతకీ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడా? చేసుకునే పరిస్థితులను ఎవరైనా సృష్టించారా అన్నది ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్న ప్రశ్న. అందరూ కలిసి ఎంతో భవిష్యత్ ఉన్న గొప్ప నటుడిని అయితే చంపేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.
కెరీర్ లో ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకెళ్లినప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది. అంతేకానీ అణగదొక్కాలనుకున్న వారికి బెండ్ అయిపోతే మన జీవితం అర్థాంతరంగా ముగుస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో అదే జరిగిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి..
నిజానికి సుశాంత్ తన కెరీర్ విషయంలోనే సినిమా అవకాశాలు లేక ఎక్కువగా నిరాశకు గురయ్యాడని అంటున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా అలాగే కరణ్ జోహార్ లే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అవకాశాలు దెబ్బతీశారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సుశాంత్ పతనానికి వారే కారణమని ఆరోపిస్తున్నాయి.
మొదటగా ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రామ్ లీలా చిత్రం కోసం మొదట సుశాంత్ ను ఎంపిక చేశాడని సమాచారం. సుశాంత్ సినిమాలో పనిచేయడానికి అనుమతించమని భన్సాలీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ను సంప్రదించాడు. అయితే నిర్మాత ఆదిత్య చోప్రా సుశాంత్ ను హీరోగా నిరాకరించాడని బాలీవుడ్ మీడియా కథనాలు వేసింది. తరువాత యశ్ రాజ్ తో కాంట్రాక్టులో ఉన్న రణవీర్ తో సినిమా చేయడానికి ఆదిత్య చోప్రా అనుమతించాడు.
బెఫిక్రే అనే మరొక చిత్రం కూడా సుశాంత్ తోనే చేయవలసి ఉంది. కానీ రణ్‌వీర్‌కు ఇది కూడా ట్రాన్స్ ఫర్ అయ్యింది. శేఖర్ కపూర్ రూపొందించిన పానీ అనే సినిమాను యశ్ రాజ్ బ్యానర్‌లో నిర్మించనున్నట్లు సుశాంత్ తో చెప్పారు. కానీ రెండేళ్ల తర్వాత ఆదిత్య చోప్రా కూడా పానీ నుండి సుశాంత్ ను తప్పించాడట.. ఇది సుశాంత్ మరియు ఆదిత్య చోప్రా మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. కరణ్ జోహార్ కూడా ఈ ఫైట్ లో తలదూర్చాడని సుశాంత్ కు వ్యతిరేకంగా ఒక సమూహం ఏర్పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
గత ఏడాది లేదా అంతకుముందు సుశాంత్ కు సినిమా అవకాశాలు దక్కకుండా బాలీవుడ్ పరిశ్రమ తొక్కేసిందని కథనాలు వెలువడ్డాయి. బాలీవుడ్ పార్టీలకు సుశాంత్ ను ఆహ్వానించకపోవడం.. పెద్ద సినిమాలు ఇవ్వకపోవడంతో సుశాంత్ కు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.
గత ఫిబ్రవరిలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యశ్ రాజ్ ఫిలింస్, సాజిద్ నదియడ్ వాలా, సల్మాన్ ఖాన్, బాలాజీ, కేజీఓ, దినేష్ విజయన్, భన్సాలీ, టీ సీరిస్ లు హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను బహిష్కరించారని.. తిరిగి అతడు టీవీ సీరిస్ లు, షార్ట్ ఫిలింలు తీసుకోవాలని కమల్ ఖాన్ ట్వీట్ చేయడం బాలీవుడ్ లో దుమారం రేపింది. బాలీవుడ్ మొత్తం సుశాంత్ ను వెలివేసిందని.. అతడిని నిస్సహాయుడిని చేశాడని ఆయన ఆరోపించారు.
అయితే సుశాంత్ ఒక తెలివైన విద్యార్థి, ఫిజిక్స్ ఒలింపియాడ్ విజేత మరియు ఇంజనీరింగ్ ప్రవేశంలో టాపర్. అతను నటుడిగా మారడానికి ఇంజనీరింగ్ డిగ్రీని విడిచిపెట్టాడు. ఎంతో గొప్పగా నటిస్తాడు. ప్రస్తుత బాలీవుడ్ హీరోలందరిలోకి చాలా బాగా నటనా ప్రావీణ్యం ఉన్నది. కానీ బాలీవుడ్ రాజకీయాల్లో బలైపోయాడు. వారి రాజకీయాలకు కుదేలయ్యాడు. 34 ఏళ్ళ వయసులోనే అతడి నటన కలలు కల్లలయ్యాయి. ఈ రాజకీయాలకు తట్టుకోలేక లోకాన్నే విడిచి వెళ్లిపోయాడు.
బాలీవుడ్ లో కొందరు నిర్మాతలు, దర్శకులు ముఠాగా ఏర్పడి నటుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అవకాశాలు దక్కకుండా చేస్తున్నారన్న ప్రచారం మొదలైంది. యశ్ రాజ్, భన్సాలీ, ఎస్ఆర్కే ప్రొడక్షన్స్ వారు, కరణ్ జోహర్ లు ఒక ముఠాగా ఏర్పడి బాలీవుడ్ లో ఎవరినీ జీవించనీయడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రపంచంలోనే రెండవ అత్యధిక సినిమాలు చేసే భారతదేశంలో అగ్రశ్రేణి సినీ పరిశ్రమను అర డజను మంది బాలీవుడ్ ప్రముఖులు నియంత్రిస్తున్నారు. ప్రతిభ, నైపుణ్యం, కృషి, అంకితభావం ఉన్న ఎవరైనా సరే బాలీవుడ్ లో విజయం సాధించాలన్నా.. అవకాశాలు దక్కించుకోవాలన్నా వీరి దయాదాక్షిణ్యాలపైనే బతకాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. నిర్దిష్ట వంశానికి, మతానికి చెందినవారే వీరికి కావాలి. కొన్ని ఇంటిపేర్లు కలిగి ఉండాలి అప్పుడే మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు. లేదంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా బయటికి గెంటేస్తారు.
బాలీవుడ్ నిర్మాత కరోన్ జోహర్ ‘కాఫీ విత్ కరన్’లో సుశాంత్ ను ఘోరంగా అవమానించడం అప్పట్లో దుమారం రేపింది. అంతేకాదు.. సుశాంత్ తో కలిసి కరణ్ తీసిన ‘డ్రైవ్ ఆన్’ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సుశాంత్ కెరీర్ ను ఈ సినిమా నాశనం చేసింది.కరణ్ అతడి కెరీర్ వాస్తవంగా చంపేశాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.
అలాగే సుశాంత్ పై వ్యతిరేక ప్రచారాన్ని చేశారు. సుశాంత్ కు షార్ట్ టెంపర్, అహంకారి, పని చేయడం కష్టం అని బాలీవుడ్‌లో గాసిప్పులు వదిలారు. పుకార్లు వ్యాపింపచేశారు. అతని చివరి చిత్రం చిచోరీ సూపర్ హిట్ అయినప్పటికీ అతని చేతిలో సినిమాలు లేవు. సుశాంత్ కు దక్కే సినిమాలన్నీ రణ్ వీర్ సింగ్ కు ఇవ్వబడ్డాయి. భన్సాలీ ముఠాను ప్రసన్నం చేసుకోవడానికి తన ఇంటిపేరు రాజ్ పుత్ ను కూడా సుశాంత్ వదులుకున్నాడు. అంతేకాదు.. సుశాంత్ కు బాలీవుడ్ లో గాడ్ ఫాదర్ లేడని.. అతడి సినిమాలు చూడకపోతే ఇక తాను బాలీవుడ్ నుంచి వైదొలుగుతాడని సొంచారియా అనే వ్యక్తి కూడా చెప్పాడు.
ఇలా బాలీవుడే సుశాంత్ ను తొక్కేసింది. అందగాడు.. తెలివైనవాడు.. నటనలో చాలా స్మార్ట్ గా ఉంటాడు.అయినా బాలీవుడ్ లో పక్షపాతానికి గురయ్యాడు. ప్రతిభ ఉన్నా అతడిని చంపేశారు. 90శాతం బాలీవుడ్ సినిమాలు చెత్త. మంచి నటులు, దర్శకులను ఇలానే తొక్కేస్తే ఇలానే ఇండస్ట్రీ సంకనాకి పోతుంది. ఇప్పటికైనా బాలీవుడ్ టాలెంట్ ఉన్న వారిని గుర్తిస్తేనే ఇండస్ట్రీ నాలుగు కాలాల పాటు బతుకుతుంది. అందరికీ బతునిస్తుంది.
-ఎన్నం