ప్రభుత్వరంగ వ్యవస్థలను చంపేస్తున్నదెవరు?

పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ఇవి మా దేశం లో   పుట్టడమే చనిపోవడానికి పుడుతా యి. కొన్ని కొందరిని ముంచి చనిపోతే , కొన్ని చాలా మందిని ముంచి చనిపోతాయి. చనిపోవడం అయితే ఖాయం అంటున్నారు మన ప్రధాన మంత్రి గారు.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఒకవైపు రష్యా లో సోషలిస్టిక్ ఆర్థిక వ్యవస్థ మరోవైపు అమెరికా లో పెట్టుబడి దారీ ఆర్థిక వ్యవస్థ లున్నాయి. ఇప్పుడు మనం భారత దేశం అని పిలుచుకుంటూ […]

Written By: NARESH, Updated On : September 27, 2020 10:08 am

subdy copy

Follow us on

పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ఇవి మా దేశం లో   పుట్టడమే చనిపోవడానికి పుడుతా యి. కొన్ని కొందరిని ముంచి చనిపోతే , కొన్ని చాలా మందిని ముంచి చనిపోతాయి. చనిపోవడం అయితే ఖాయం అంటున్నారు మన ప్రధాన మంత్రి గారు.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఒకవైపు రష్యా లో సోషలిస్టిక్ ఆర్థిక వ్యవస్థ మరోవైపు అమెరికా లో పెట్టుబడి దారీ ఆర్థిక వ్యవస్థ లున్నాయి. ఇప్పుడు మనం భారత దేశం అని పిలుచుకుంటూ ఉన్న ఈ భూభాగం ఆనాటికి దాదాపు 650 సంస్థానాలు, ఆ  పైన బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పాలనలో ప్రజల మూలుగు లు పీల్చేశారు. బ్రిటిష్ వాళ్ళు అయితే ఆ సంపదను ఇంగ్లాండు కు  తరలించుక పోతే , ఇక్కడి సంస్థానాలు, స్వతంత్ర రాజ్యాలు అయితే  ఫ్యూడల్ సంస్కృతి లో భాగంగా  తమ ఆధిక్యతను ప్రదర్శించు కోవడానికి కోటలు, గడీలు, బురుజులు, గుడులు, మసీదులు, చర్చిలు, మొదలగు అనుత్పా దకమైన భావోద్వేగ రంగాల పైన అధికంగా ఖర్చు చేసుకొని పెద్దమొత్తంలో  పారిశ్రామిక రంగం లో పెట్టుబడులు పెట్టేటంత  ఉన్నతమైన  ఆర్థిక స్థితి లో భారత దేశం లేకుండా చేశారు. అప్పటి పరిస్తితిలో భారత దేశం పెట్టుబడి దారీ ఆర్థిక వ్యవస్థ కు అనుకూలంగా లేదు. ఎందుకంటే ఏ ఒక్కరి వద్దనో లేదా జాయింట్ కంపెనీ ద్వారానో డబ్బులు పెట్టుబడి పెట్టే పరిస్తితి లేదు.  పోనీ రష్యా వలె సోషలిస్టిక్ ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్దామా అంటే, భారత స్వాతంత్య్రోద్యమం లో నాయకత్వం వహించిన వారంతా భూస్వామ్య భావజాలం నుండి వచ్చిన వారు. వారిలో ఎవ్వరికీ కూడా సోషలిస్టిక్ ఆర్థిక వ్యవస్థ పట్ల అనుకూలత లేదు. అలాంటి ఆలోచన ఉన్న భగత్ సింగ్ ను ఆదిలోనే కాంగ్రెస్ జాతి పితల పుణ్యాన పోగొట్టు కుంటిమాయే.

Also Read: ‘కాసు’పత్రుల కరోనా దోపిడీ

అందుకని భారత పాలకుల ముందు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం మిశ్రమ  ఆర్థిక వ్యవస్థ. అంటే ప్రజల నుండి పన్నుల రూపం లో వసూలు చేసే పెద్ద మొత్తాన్ని భారీ పరిశ్రమల పైన పెట్టుబడులు పెట్టేందుకు, చిన్న చిన్న పరిశ్రమలను పెట్టుబడి దారులు పెట్టుకొనే విధంగా, ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. పబ్లిక్ నుండి పన్నుల రూపం లో వచ్చిన సొమ్ముతో నెలకొల్పిన పరిశ్రమలను పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నారు. వాటి నిర్వహణను పబ్లిక్ ద్వారా ఎన్నిక కాబడిన ప్రజా ప్రభుత్వం నిర్వహించాలని చట్టాలు చేసుకున్నాము. అప్పుడు ,ఇప్పుడు ఎప్పుడైనా ప్రజలకు జవాబు దారి,  చట్టపరంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వ మే కదా? కనుక ప్రభుత్వం చేత నిర్వహించబడిన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ క్రమంగా తమ మూల పెట్టుబడిని కోల్పోతూ ప్రైవేట్ పెట్టుబడులు బలిసి పోవడానికి తోడ్పడే విధానాలను అవలంబిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ లల్లో నడుస్తున్న వ్యవస్థలన్నీ అయితే రాజకీయ నాయకుల వి, కాకపోతే వాళ్ల బంధు మిత్రులకు చెందినవి అయి ఉంటున్నాయి.

ప్రారంభం లో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వద్ద డబ్బులు లేకుండా ఉన్న ప్రైవేట్ సెక్టార్ ఇప్పుడు ఎవరు ఊహించ నంతగా  బలిసి పోయి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ను అమాంతంగా కొనే స్థాయికి ఎదిగి పోయాయి. ఇప్పటి తరానికి కండ్ల ముందు కనిపిస్తున్న భారత్ సంచార నిగం, అదే బి ఎస్ ఎన్ ఎల్. కోల్ ఇండియా లాంటివి. అవి నష్టాల్లో కూరుకు పోవడానికి కారణం ఎవ్వరూ? ప్రత్యక్ష భాగస్వామ్యం లేని ప్రజలా లేక పాలనా బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వమా? అవి నష్టాల్లో కూరుకు పోవడానికి 100% శాతం కారణమైన ప్రభుత్వం ఇవ్వాళ ప్రభుత్వ సెక్టార్ అనేది పుట్టిందే చావడానికి అంటుంటే, అసలు వాటిని చంపివేస్తున్నది ఎవ్వరూ అని ప్రజలకు అడిగే హక్కు లేదా? దొంగే,  దొంగా , దొంగా అని అరిచి నట్లు లేదా? వాటిని అలా  చంపి వేసింది ఎవరు? వాటిని నష్టాల్లో ముంచింది ఎవరు?
లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం పి ఎస్ యు ల్లో శూన్యం అయి ప్రైవేట్ సెక్టార్ లో ఇప్పుడు వాళ్ల ఆస్తులై తేలిన దానికి బాధ్యులు ప్రభుత్వాలు కావా? ప్రజా దర్బారు లో ఇందుకు బాధ్యులైన వారిపైన విచారణ జరిపి చర్యలు గైకొని  వలసిన అవసరం లేదా?

Also Read: వ్యవసాయ‘బిల్లు’ తెచ్చిన చేటు.. 23 ఏళ్ల బంధానికి బ్రేకప్‌

ఒక ప్రభుత్వం పైన మరో ప్రభుత్వం నెపం వేసుకొని జరిగిన నష్టానికి బాధ్యత పడకుండా అమాయకంగా ఉండి పోతున్నాయి. పన్నుల రూపంలో పెట్టిన తమ పెట్టుబడులు లాభాల పిల్లలు పెట్టీ తమ జీవితాలు బాగు పడతాయని ఆశ పాడిన అశేష ప్రజానీకం తమ పెట్టుబడులకు లాభం రాక పోగా పెట్టిన పెట్టుబడి లేకుండా పోయి తమకు దక్క వలసిన స్వాతంత్ర ఫలాలు దక్కక పోవడంతో  జరిగిన నష్టానికి,  కోల్పోయిన జీవితాలకు, అవిద్యతో, అనారోగ్యం తో,  నిరుద్యోగంతో, ఆకలి తో,  అప్పుల తో, అలిసి పోయి అర్ధాంతరంగా రాలిపోయిన ప్రాణాలకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? ఎంతకాలం ప్రజలను మాయ మాటలతో భావోద్వేగాలతో ఫ్యూడల్ వ్యవస్థ మోసపుచ్చి నట్లు మోస గీస్తారు. అంటూ ప్రభుత్వాలను ప్రశ్నించే ధైర్యాన్ని   ప్రజలు పెంచుకునే ప్రయత్నం ఇకనైనా చేయరా?

-వీరగోని పెంటయ్య