‘పెళ్లికాని ప్రసాద్’ ల బాధ ఇదీ!

మూడు పదులు దాటుతున్నాయి. అయినా పెళ్లి ధ్యాసే యువతకు ఉండడం లేదు. జాబ్ కోసం చకోర పక్షిలా తిరుగుతున్నారు. అది రాకపోవడంతో విసిగివేసారి పోతున్నారు. జాబ్ వచ్చి సెటిల్ కాకపోవడంతో పెళ్లి చేసుకోవడం లేదు. పెళ్లి కాక.. జీవితంలో సెటిల్ కాలేక యాతన పడుతున్నారు. Also Read: కరోనా కలిపింది ఇద్దరినీ.. లైఫ్ మరింత రొమాంటిక్! ఎక్కడ చూసినా ఇప్పుడు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఏళ్లుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా నోటిఫికేషన్లు రాక యువతలో […]

Written By: NARESH, Updated On : December 14, 2020 2:10 pm
Follow us on

మూడు పదులు దాటుతున్నాయి. అయినా పెళ్లి ధ్యాసే యువతకు ఉండడం లేదు. జాబ్ కోసం చకోర పక్షిలా తిరుగుతున్నారు. అది రాకపోవడంతో విసిగివేసారి పోతున్నారు. జాబ్ వచ్చి సెటిల్ కాకపోవడంతో పెళ్లి చేసుకోవడం లేదు. పెళ్లి కాక.. జీవితంలో సెటిల్ కాలేక యాతన పడుతున్నారు.

Also Read: కరోనా కలిపింది ఇద్దరినీ.. లైఫ్ మరింత రొమాంటిక్!

ఎక్కడ చూసినా ఇప్పుడు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఏళ్లుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా నోటిఫికేషన్లు రాక యువతలో ఆందోళన నెలకొంది. వయసు దాటిపోతోందన్న ఆవేదన ఉంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర ఏర్పడ్డాక అభివృద్ధి పేరిట అసలు ఉద్యోగాలు వేయలేదు. భర్తీ చేయలేదు. అటు ఏపీలోనూ అప్పులతో విడిపోయిన రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీని పాలకులు పట్టించుకోలేదు.

యువత ఇప్పుడు పుస్తకాల పురుగులు అయిపోతున్నారు. ఏళ్లు గడిచిపోతున్నా పోటీ పరీక్షలు మాత్రం పెట్టడం లేదు. ఓ వైపు ఆర్థిక భారం.. మరోవైపు వయోభారం పెరిగిపోతున్నాయి. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లేక.. వేరే పనిచేసేందుకు ఇప్పటికీ మనసు ఒప్పక సతమతమవుతున్నాడు. మరో వైపు కళ్ల ముందు చెట్టంత ఎదిగిన కొడుకు ఏం పనిచేస్తలేడని.. వాడికి పెండ్లి ఎట్టా చేసేదని ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి ఈడు దాటిపోతున్న యువకులు బోలెడు మంది కనిపిస్తున్నారు. సర్కార్ ఉద్యోగం కోసం చకోర పక్షిలా వేచిచూస్తున్న వారెందరో ఉన్నారు. మరోవైపు ప్రైవేట్ ఉద్యోగాలతో నెట్టుకొస్తున్న వారు కరోనా బారిన పడి ఆ కాస్త ఉద్యోగాలు పోయి ఆధారం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: భారత్ లో కరోనా కేసులు తగ్గడానికి కారణమిదే..?

ఇప్పుడు సమాజంలో ఆస్తిపాస్తుల కంటే పిల్లవాడు ఏ ఉద్యోగం, సద్యోగం చేస్తున్నాడని చూసి మరీ పిల్లను ఇస్తున్నాడు. వ్యాపారాలు చేసేవారికి కొంచెం అమ్మాయి దొరకడం కష్టమే. పేదవారైనా ఉద్యోగం చేస్తున్నాడంటే కళ్లు మూసుకొని సంబంధం కుదుర్చుకుంటున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా ఆస్తులు లేకున్నా వాళ్లకు మంచి చదువులు చెప్పడానికి ఎంతైనా అప్పులు చేసి చదివిస్తున్నారు. తీరా చదివాక పిల్లలకు ఉద్యోగాలు రాక.. పెళ్లిళ్లు కాక ఇప్పుడు సమాజంలో ఇదో మేజర్ సమస్య అయ్యి కూర్చుంది.

ఇప్పటికీ చాలా మంది యువకులు జాబ్ ల కోసం చదువుతూనే ఉన్నారు. ఏళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో చాలా మంది మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటి నుంచి డబ్బులను అడగలేక, నగరాల్లో ఖర్చును భరించలేక మధ్యలోనే తమ ప్రిపరేషన్ వదిలి ఇంటికి వచ్చి పొలం పనులు, ప్రైవేటు జాబులు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఆశతో చదువుతూనే ఉన్నారు. ఇందులో చాలా మందికి పెళ్లీడు దశ కూడా దాటిపోవడమే విషాదం ఉంది. దీంతో తల్లిదండ్రులు కూడా ఆ చదువుడు బంద్ చేసి ఇంటికొచ్చి ఏదో పని చేసుకోమని చెప్పే పరిస్థితి దాపురించింది. పెళ్లీడు దాటిపోతే పిల్లను ఇవ్వని పరిస్థితి ఉండడంతో యవతకు ఇప్పుడు అగ్ని పరీక్షగా ఇది మారింది.. ఓవైపు నోటిఫికేషన్లు రాక.. మరో వైపు ఇంట్లో పరిస్థితికి పూర్తిగా తలొగ్గక సదురు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు.

-నరేశ్

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్