https://oktelugu.com/

కేసీఆర్ ను వెంటాడుతున్న ఆ ‘అర్థరాత్రి’ భయం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదీ చేసినా అత్యంత పకడ్బందీగా.. నాటకీయంగా చేస్తుంటారు. అందుకే ఆయన చేసేవరకు మూడో కంటికి కూడా తెలియదు.. తెలిశాక అది సంచలనమవుతోంది. ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్ ను కూడా అర్థరాత్రి 12 గంటలకు స్టార్ట్ చేసి అందులోని మత ప్రార్థనాలయాలు అయిన నల్లపోచమ్మ గుడి.. మసీదును అత్యంత చాకచక్యంగా కూలగొట్టించేశాడు. సచివాలయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించేశాడు. అయితే కూల్చివేసిన మసీదు సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్ ను వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. సెక్రటేరియట్ భవనం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 18, 2020 8:30 pm
    Follow us on


    తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదీ చేసినా అత్యంత పకడ్బందీగా.. నాటకీయంగా చేస్తుంటారు. అందుకే ఆయన చేసేవరకు మూడో కంటికి కూడా తెలియదు.. తెలిశాక అది సంచలనమవుతోంది. ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్ ను కూడా అర్థరాత్రి 12 గంటలకు స్టార్ట్ చేసి అందులోని మత ప్రార్థనాలయాలు అయిన నల్లపోచమ్మ గుడి.. మసీదును అత్యంత చాకచక్యంగా కూలగొట్టించేశాడు. సచివాలయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించేశాడు.

    అయితే కూల్చివేసిన మసీదు సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్ ను వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. సెక్రటేరియట్ భవనం కూల్చివేత సమయంలో దెబ్బతిన్న మసీదును పునర్నిర్మిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో తన స్నేహితుడు.. ఆ వర్గానికే చెందిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా దీనికి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఇతర ముస్లిం నాయకులు మాత్రం యుద్ధం మొదలుపెట్టడం కేసీఆర్ కు మింగుడుపడని వ్యవహారంగా మారిందట..

    సచివాలయం నిర్మాణం.. తెరపైకి కొత్త డిమాండ్..!

    హైదరాబాద్ పాతబస్తీలోని ముస్లింల అత్యున్నత సంస్థ ‘తెహ్రీక్ ముస్లిం షబ్బాన్’ తాజాగా సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని మసీదు దెబ్బతినడాన్ని సీరియస్ గా తీసుకుంది. దీన్ని నిరసిస్తూ జంట నగరాల్లోని మసీదులపై నల్లజెండాలను ఎగురవేయాలని ముస్లింలను కోరింది. దీనిపై పోరుబాట పట్టారు. సచివాలయ ప్రాంగణంలో వేరే ప్రదేశంలో మసీదును పునర్నిర్మిస్తానన్న కేసీఆర్ ప్రతిపాదనను తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ మాలిక్ ఖండించారు. మసీదును ఒకే చోట నిర్మించాలని.. అది ఒకసారి ఒకే చోట మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. సంప్రదాయాలు పాటించాలని కొత్త మెలిక పెట్టారు. ముస్లిం నాయకుల ప్రతినిధి ప్రతినిధి బృందాన్ని కూల్చివేత స్థలాన్ని సందర్శించడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.

    సోనియా గాంధీని నమ్ముకుంటే నిండా మునిగినట్లే

    ఈ తెహ్రీక్ సంస్థ అనేక రెబల్ ఇస్లామిక్ గ్రూపుల మద్దతును కలిగి ఉంది. ముస్లింలలోనే అత్యున్నత సంస్థ. ఆ సంస్థ కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లడం గులాబీ దళపతిని కలవరపాటుకు గురిచేస్తోంది. పైగా ఎంఐఎంను, అసదుద్దీన్ మసీదు పునర్నిర్మాణాన్ని స్వాగతించడాన్ని ఈ తెహ్రీక్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాదు.. తాజాగా రాష్ట్రంలో షియా ఆస్తులను పరిరక్షించడంలో బోర్డు విఫలమైందని మంగళవారం వక్ఫ్ బోర్డు సమావేశాన్ని షియా ముస్లింలు బహిష్కరించి పోరుబాట పట్టారు. దీంతో మసీదు కూల్చివేత అల్లర్లకు దారితీస్తుందేమోనన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోందట..