https://oktelugu.com/

హీటెక్కిస్తున్న గ్రేటర్‌‌ సమరం.. ఎవరికి మొగ్గు ఉంది?

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఒక్క జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మాత్రమే. కానీ.. ఈ ఎన్నికల వాతావరణాన్ని బట్టి చూస్తుంటే మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన లీడర్లంతా ఇప్పుడు హైదరాబాద్‌లో మకాం వేశారు. జిల్లాల నుంచి ఓ మోస్తరు లీడర్‌‌ నుంచి మొదలుకొని మంత్రుల వరకూ అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక దెబ్బతో అధికారి టీఆర్‌‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే.. జిల్లాల నుంచి తమ పార్టీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 11:51 am
    Follow us on

    Greater Elections 2020

    తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఒక్క జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మాత్రమే. కానీ.. ఈ ఎన్నికల వాతావరణాన్ని బట్టి చూస్తుంటే మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన లీడర్లంతా ఇప్పుడు హైదరాబాద్‌లో మకాం వేశారు. జిల్లాల నుంచి ఓ మోస్తరు లీడర్‌‌ నుంచి మొదలుకొని మంత్రుల వరకూ అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక దెబ్బతో అధికారి టీఆర్‌‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే.. జిల్లాల నుంచి తమ పార్టీ కార్యకర్తలను పిలిపించి మరీ ఇక్కడ ప్రచారం చేయిస్తోంది.

    Also Read: బీజేపీ విషయంలో కేసీఆర్ ‘గ్రేట్’ మిస్టేక్ చేస్తున్నారా?

    ఐదు లోక్‌సభ స్థానాలు.. 24 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 150 డివిజన్ల సమాహారమే గ్రేటర్‌ హైదరాబాద్‌. తెలంగాణకు రాజధాని. రాజకీయ కార్యక్షేత్రం.. రాష్ట్రంలో నాలుగోవంతు ప్రజలకు ఇంటిదైవం. 119 సీట్లున్న అసెంబ్లీపైన ఈ ఎన్నికల తీర్పు ప్రభావం పడుతుందని అధికార, ప్రతిపక్షాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే.. హైదరాబాద్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని ఎన్నికల ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే ఇది హైదరాబాద్ స్థానిక సంస్థ ఎన్నిక. కేవలం హైదరాబాద్‌లో నీళ్ళు.. డ్రైనేజీ.. రోడ్లు.. పారిశుద్ధ్యం.. వంటి వసతులపైనే గ్రేటర్ పాలకమండలి పనిచేస్తుంది. వాటి అభివృద్ధినే చూస్తుంది. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో 74 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తీర్పు ఇవ్వనున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.

    ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ఎందుకు సీరియస్‌గా తీసుకున్నాయో ఒకసారి పరిశీలిస్తే.. టీఆర్ఎస్ తెలంగాణ ఛాంపియన్. రెండుసార్లు గెలిచి ఆరేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తోంది. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌కు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ప్రజాభిప్రాయం మారుతోందా? అన్న అనుమానాలు అటు అధికారపార్టీలో.. ఇటు ప్రతిపక్షంలో మొదలయ్యాయి. ఈలోగా గ్రేటర్ ఎన్నికలు దూసుకొచ్చాయి. రాజధానిలో జరిగే ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ప్రజల నమ్మకం ఏమాత్రం తమపై చెరిగిపోలేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మారడం రాజకీయంగా ఇబ్బంది అనుకుంటోంది.

    Also Read: కాపీ కొట్టడానికి తెలివి ఉండాలె.. బీజేపీ మేనిఫెస్టోపై కేటీఆర్

    దుబ్బాక గెలుపుతో మంచి బూస్టింగ్‌లో ఉంది బీజేపీ. అందుకే ఈ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేఒక్క సీటుకు పరిమితమైన కమలనాథులు.. లోక్‌సభ సమరానికి వచ్చేసరికి నాలుగుచోట్ల గెలిచారు. దుబ్బాక ఉపఎన్నికల విజయం కమలనాథుల్లో మరింత ఉత్సాహం నింపింది. గ్రేటర్లోనూ గెలిచి.. టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని చూపాలన్నది వీరి ప్లాన్. అందుకే ఆ పార్టీ ఎప్పుడూ లేనంత దూకుడుగా వెళ్తొంది. అయితే.. కమలనాథులు ఈ ఎన్నికలను టర్నింగ్‌ పాయింట్‌లా భావిస్తున్నారు.

    ఇక కాంగ్రెస్‌ పార్టీకి గ్రేటర్ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. తెలంగాణ ఇచ్చిన ఆ పార్టీ రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడింది. దుబ్బాకలో డిపాజిట్ రాని దుస్థితి. దుబ్బాకలో బీజేపీ గెలుపు.. అధికార టీఆర్ఎస్ ఓటమి.. కాంగ్రెస్ పార్టీకి సంతోషాన్ని ఇచ్చింది. అదే సమయంలో తమ పార్టీని కనీస ప్రత్యామ్నాయంగా కూడా జనం చూడకపోవడం నేతలను ఆందోళనలో పడేసింది. దుబ్బాక ఓటమికి పోస్ట్‌మార్టం చేసుకోకముందే.. గ్రేటర్ ఎన్నికలు కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ల మధ్య తగాదాలు కామన్‌. అన్ని సర్దుకొని 146 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించినా.. వారిని గెలిపించుకునే సత్తా ఆ పార్టీకి కనిపించడం లేదు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    మరో పార్టీ అయిన ఎంఐఎం పాతబస్తీలో పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ పార్టీ అయినప్పటికీ ఈ మధ్య ఉత్తరాదిలో దుమ్ము దులిపింది. బీహార్ ఎన్నికల్లో ఐదు చోట్ల విజయం సాధించింది. పాతబస్తీ కా షేర్ అని పేరున్న ఎంఐఎంకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఓ వైపు టీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ తమ స్థానాల్లో పాగా వేయాలని చూస్తుండటంతో ఉన్న డివిజన్లు చెదిరిపోకుండా జాగ్రత్తపడుతోంది. అందుకే గత ఎన్నికల్లో 60 డివిజన్లలో పోటీ చేసి 44 సొంతం చేసుకున్న మజ్లీస్‌ ఈసారి కేవలం 51స్థానాల్లోనే బరిలోకి దిగింది. వాటన్నింటినీ కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఇలా పార్టీలన్నీ తమ రాజకీయవ్యూహాలతో గ్రేటర్‌ సమరంలో దూసుకెళ్తున్నాయి.