https://oktelugu.com/

వైసీపీలో మంత్రి పదవి కోసం ఇన్ని కుట్రలా?

రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి. వాటన్నింటిని దాటుకొని వెళ్లాలి. మనకు అడ్డుగా వచ్చేవారిని అణగదొక్కేయాలి. రాజకీయంగా దెబ్బ కొట్టాలి. అగ్రనాయకుడిగా ఎదిగేవాళ్లంతా తమ ప్రయాణంలో ఇలాంటి పనులెన్నో చేసి ఉంటారు. ఇప్పుడు భావి నాయకులుగా ఎదిగే వాళ్లు కూడా అదే చేస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది రోజానే.. ఆమె వాగ్ధాటిని అసెంబ్లీలో బయటా అందరం చూశాం. నిజానికి జగన్ తన తొలి కేబినెట్ లో రోజాను హోంమంత్రిని చేస్తారని అంతా ఆశించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2020 / 08:05 PM IST
    Follow us on


    రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి. వాటన్నింటిని దాటుకొని వెళ్లాలి. మనకు అడ్డుగా వచ్చేవారిని అణగదొక్కేయాలి. రాజకీయంగా దెబ్బ కొట్టాలి. అగ్రనాయకుడిగా ఎదిగేవాళ్లంతా తమ ప్రయాణంలో ఇలాంటి పనులెన్నో చేసి ఉంటారు. ఇప్పుడు భావి నాయకులుగా ఎదిగే వాళ్లు కూడా అదే చేస్తున్నారు.

    వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది రోజానే.. ఆమె వాగ్ధాటిని అసెంబ్లీలో బయటా అందరం చూశాం. నిజానికి జగన్ తన తొలి కేబినెట్ లో రోజాను హోంమంత్రిని చేస్తారని అంతా ఆశించారు. కానీ సామాజికకోణం తెరపైకి తెచ్చిన సీఎం జగన్ తన కేబినెట్ లో అగ్రకులమైన రోజాకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. రోజాకు మంత్రి పదవి దక్కలేదన్న వార్త నాడు అందరినీ షాక్ కు గురిచేసింది.

    చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

    దీంతో రోజా అలగడం.. ఆమెను సీఎం జగన్ స్వయంగా బుజ్జగించడం.. ఏపీఐఐసీ చైర్మన్ పదవిని ఇవ్వడం.. ఆమె కాస్త తగ్గి తన పని తాను సైలెంట్ గా చేసుకుంటున్నారు.

    అయితే తాజాగా ఇద్దరు మంత్రులు రాజ్యసభ ఎంపీలుగా పోయి వారి పదవులకు రాజీనామా చేశారు. ఇక సీఎం జగన్ కూడా పనిచేయని నలుగురు మంత్రులకు స్వస్తి పలుకబోతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి పదవుల ఆశలు మళ్లీ ఊపందుకున్నాయి.

    ఏపీలో పక్కా ప్లానింగ్ తో వెళుతున్న బీజేపీ..!

    గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి బీసీ వర్గానికి చెందిన వారే. ఇప్పుడు అదే జిల్లా నుంచి బీసీకే మంత్రి పదవి దక్కనుందని సమాచారం. ఇందులో చురుకైన చిలకూరిలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడుదల రజినీ పేరు బాగా వినిపిస్తోంది. ఆమె సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్నారట..

    అయితే మంత్రి పదవిపై ఈసారి బాగా ఆశలు పెంచుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా బ్యాచ్ కావాలనే చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీని టార్గెట్ చేశారని ఆమెను అభాసుపాలు చేసే కుట్ర చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రోజాకు పోటీ అయిన రజినీపై సోషల్ మీడియా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తోందని ఈ మధ్య వార్తలు ఎక్కువయ్యాయి. కొన్ని వెబ్ సైట్స్ లోనూ రజినీకి నెగెటివ్ గా రాయిస్తున్నారట.. ఇవి అధిష్టానం దృష్టిలో పడి ఆమెకు మంత్రి పదవిని దూరం చేయాలనే స్కెచ్ సాగుతోందట.. ఇలా వైసీపీలో మంత్రి పదవుల కోసం ఒకరినొకరు తగ్గించుకునే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.