పీవీ నరసింహారావుకు ఘనంగా నివాళి

దివంగత ప్రధాని పీవీ నరసింహారావ వర్ధంతిని తెలంగాణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రధాని పీవీ సేవలను స్మరించుకున్నారు. పీవీ నరసింహారావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో ఆయన ప్రవేశపెట్టిన భూ సంస్కరణలను ప్రస్తుతం భారత దేశ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. బహుభాషా వేత్తగా, గొప్ప పరిపాలకుడిగా పీవీ అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించారన్నారు. కాగా పీవీ ఘాట్ లో అసెంబ్లీ […]

Written By: Suresh, Updated On : December 23, 2020 4:39 pm
Follow us on

దివంగత ప్రధాని పీవీ నరసింహారావ వర్ధంతిని తెలంగాణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రధాని పీవీ సేవలను స్మరించుకున్నారు. పీవీ నరసింహారావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో ఆయన ప్రవేశపెట్టిన భూ సంస్కరణలను ప్రస్తుతం భారత దేశ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. బహుభాషా వేత్తగా, గొప్ప పరిపాలకుడిగా పీవీ అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించారన్నారు. కాగా పీవీ ఘాట్ లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు నివాళులర్పించారు.