https://oktelugu.com/

కొయ్యూరు నెత్తుటి గాయానికి….20ఏళ్లు

సరిగ్గా 20ఏళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1999 డిసెంబర్ 2 న జరిగిన ఎన్కౌంటర్ లో పీపుల్స్ వార్ గ్రూప్ నకు భారీ ఎత్తున నష్టం జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో పీపుల్స్ వార్ గ్రూప్ లోని నక్సల్స్ అగ్రనేతలైన కేంద్ర కమిటీ సభ్యులు ముగ్గురిని కోల్పోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొయ్యురు అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ గా పేర్కొనే ఈ ఘటనలో నల్లా ఆదిరెడ్డి(శ్యామ్), ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి(మహేష్), శీలం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2020 / 11:27 AM IST
    Follow us on

    సరిగ్గా 20ఏళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1999 డిసెంబర్ 2 న జరిగిన ఎన్కౌంటర్ లో పీపుల్స్ వార్ గ్రూప్ నకు భారీ ఎత్తున నష్టం జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో పీపుల్స్ వార్ గ్రూప్ లోని నక్సల్స్ అగ్రనేతలైన కేంద్ర కమిటీ సభ్యులు ముగ్గురిని కోల్పోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొయ్యురు అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ గా పేర్కొనే ఈ ఘటనలో నల్లా ఆదిరెడ్డి(శ్యామ్), ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి(మహేష్), శీలం నరేష్ (మురళి) తోపాటు ఓ పశువులకాపరి కూడా చనిపోయాడు.డీజీపీ హెచ్ జె దొర కనుసన్నల్లో 2 డిసెంబర్ 1999న జరిగిన ఈ ఎన్కౌంటర్… పీపుల్స్ వార్ గ్రూప్ నాయకత్వాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.

    Also Read: చివరి గంటలో అంతా ‘తారుమారు’.. పోలింగ్ శాతం గతంకంటే ఎక్కువే..!

    ఈ ఎన్కౌంటర్ జరిగిననాటి నుంచే పీపుల్స్ వార్ గ్రూప్ అగ్రనాయకులు ఎన్కౌంటర్ లు, లేదంటే కోవర్ట్ ఆపరేషన్లలో నేలకొరగడం మొదలైంది.ఆ సమయంలో పోలీస్ ఎన్కౌంటర్లు, నక్సల్స్ హత్యలు, గ్రీన్ టైగర్స్ పేరుతో పౌరహక్కుల సంఘం నేతల కిడ్నాపులు, హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా యుద్ధవాతావరణం నెలకొని ఉండేది. 2002 వరకు డీజీపీ గా పనిచేసిన హెచ్ జె దొర చొరవతో లొంగిపోయిన కత్తుల సమ్మయ్య, బయ్యపు సమ్మిరెడ్డి, నయీమ్ లు పీపుల్స్ వార్ పైనే యుద్ధం ప్రకటించి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. అప్పటి నుంచే రాష్ట్రంలో పీపుల్స్ వార్ గ్రూప్ ఉధృతి తగ్గడం మొదలైంది.2004 లో వై ఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో పీపుల్స్ వార్ గ్రూప్ అగ్రనాయకులకు జరిగిన” శాంతి చర్చల” అనంతరం పీపుల్స్ వార్ క్రమంగా కనుమరుగై రాష్ట్రంలో ఉనికి కోల్పోయి ఇతర రాష్ట్రాలకు విస్తరించింది.

    *పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నేపథ్యం…

    డీజీపీ హెచ్ జె దొర ఆధ్వర్యంలో నక్సల్స్ అగ్రనేతలను పట్టుకోవడం లేదా మట్టుబెట్టడమే లక్ష్యంగా 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు ఏర్పాటయ్యాయి.ఒక్కో బృందాన్ని డీఎస్పీ, ఆపై స్థాయి అధికారి పర్యవేక్షించేవారు. ఈ బృందాల్లో షార్ప్ షూటర్లు,అర్ ఎస్సై లు,సి ఐ లు, నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే కానిస్టేబుళ్ళు ఉండేవారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్ ఎస్సై గా పనిచేసే డేనియల్ అనే ఓ అధికారి కూడా ఈ బృందాల్లో సభ్యుడు.కొయ్యురు అడవుల్లో కేంద్రకమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ లు ఎన్కౌంటర్ కావడంలో ఈయనదే కీలక పాత్ర అని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటుంటాయి.

    అయితే,కోవర్ట్ ఆపరేషన్ ద్వారా బెంగళూరు డెన్ లో పట్టుకొని కరీంనగర్ జిల్లా కొయ్యురు అడవుల్లో బూటకపు ఎన్కౌంటర్లో హత్యచేశారని నక్సల్స్ సానుభూతిపరులు, పౌరహక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గా ఇటీవలే రిటైర్ అయిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి బెంగళూరులో డేనియల్ టీమ్ నుంచి ఆనాడు తృటిలో తప్పించుకున్నట్టు చెబుతుంటారు. బెంగళూరులో ఆనాటి “పీపుల్స్ వార్ గ్రూప్ కేంద్ర కమిటీ “సభ్యుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినందునే “గణపతి” డేనియల్ ట్రాప్ నుంచి తప్పించుకున్నట్టు చెబుతుంటారు.

    Also Read: జగన్ ధాటికి చంద్రబాబు రాజకీయ సన్యాసమేనా?

    నక్సల్స్ అగ్రనేతలను కోవర్ట్ ఆపరేషన్లో మట్టుబెట్టి పార్టీకి తీవ్ర నష్టం కల్గించినందునే.. అర్ ఎస్సై ఐన డేనియల్ కు ఏకంగా డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చి నక్సల్స్ ఆపరేషన్లలో ఓఎస్డి గా నియమించారని పౌరహక్కుల నేతలు పేర్కొంటుంటారు. కొయ్యురు ఎన్కౌంటర్లో చనిపోయేనాటికి నల్లా ఆదిరెడ్డి పార్టీ “మిలిటరీ వింగ్”లో కీలక సభ్యుడని సమాచారం .. ఆదిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే గెరిల్లా ఆపరేషన్లలో పోలీసులు, ఇంఫార్మర్లు చనిపోగా, ప్రభుత్వ ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయని సమాచారం.అందుకే అయన స్మృత్యర్థం ప్రథమ వర్ధంతి అయిన 2000 డిసెంబర్ 2 నుంచి ప్రతియేటా వారం రోజులపాటు “పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ” ఉత్సవాలను పార్టీ నిర్వహిస్తోంది.

    నేటి నుంచి తమకు పట్టున్న ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఏవోబీ, తెలంగాణా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వారం రోజులపాటు జరిగే పి ఎల్ జి ఏ వారోత్సవాలను ఘనంగా నిర్వహించి ఉనికి చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ సన్నద్ధమైంది.అదే సమయంలో ఆయారాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు పి ఎల్ జి ఏ వారోత్సవాలను అడ్డుకునేందుకు సాయుధ బలగాలను రంగంలోకి దింపాయి.”పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ” ఉత్సవాలను భగ్నం చేసేందుకు నెలరోజుల ముందునుంచే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూమ్బింగ్ ఆపరేషన్లతో అడవులను జల్లెడ పడుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    -శ్రీరాముల కొమురయ్య, సీనియర్ జర్నలిస్ట్