Lover Dialed 100: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందని చెబుతారు. అది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ప్రేమికుడు మాట్లాడటం లేదని పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. తమ ప్రేమ కోసం పోలీసులను వాడుకోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రేమికులు చేసిన దానికి ఏం అనాలో అర్థం కాక నవ్వుకోవడం వారి వంతయింది.
Also Read: వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే!
మధ్యప్రదేశ్ లోని చింద్వారాకు చెందిన మహిళకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ప్రేమికుడు జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. కానీ ప్రియురాలిని పిలవలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అతడు ఆమెను పట్టించుకోలేదు. ఆమె మాట్లాడటానికి ప్రయత్నించినా అతడు మొహం చాటేయడంతో ఇక లాభం లేదనుకుంది.
ఎలాగైనా ప్రియుడిని తన వైపు తిప్పుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ ఆలోచన తట్టింది. 100 నంబర్ కు ఫోన్ చేస్తే పరిష్కారం దొరుకుతుందని భావించింది. తక్షణమే ఫోన్ చేసి మాట్టాడింది. కానీ సమస్య ఉందని చెప్పినా అదేంటో వివరించలేదు. దీంతో వారు హుటాహుటిన వచ్చి ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నారు.
కానీ చివరికి అతడిని పిలిపించి ఆమెతో మాట్లాడించారు. వారి జోక్యంతో ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోయింది. మాటలు కలిశాయి. తరువాత పెద్దల సమక్షంలో ఆర్య సమాజ్ లో పెళ్లి కూడా చేసుకున్నారు. పోలీసుల జోక్యంతో వారి పెళ్లి జరగడంతో అందరు సంతోషం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోలీసుల తీరుతో ఓ జంట కలుసుకోవడంతో అందరు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: పాకిస్తాన్ లో ధరల మోత.. చక్కెర, పాలు, పెట్రోల్ రేటు ఎంతో?
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Girl friend dialed 100 to reconnect her to her boyfriend
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com