Chicken- Mutton: మనుషుల్లో మాంసప్రియులే ఎక్కువ మంది ఉన్నారు. మాంసాహారమంటే అందరికి మక్కువే. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఇవన్నీ మాంసాహారాలే. కానీ ఎక్కువగా మాత్రం చికెన్, మటన్ తినడం అలవాటు. ఎక్కువ మంది వీటికే ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో ఇందులో ఏది బెటర్ అనే సందేహాలు కూడా అందరికి వస్తుంటాయి. చికెన్, మటన్ రెండు మాంసాహారాలే. రెండు కొవ్వులు పెంచి మనిషికి నష్టాన్ని కలిగిస్తాయి. కానీ జిహ్వ చాపల్యం చంపుకోలేని వారు మాంసాహారాన్ని దూరం చేసుకోరు. కొందరైతే ప్రతి దినం ఏదో ఒక మాంసం లేనిదే ముద్ద దిగదంటారు.

చికెన్ మటన్ లో ఏది మంచిదనే అభిప్రాయాలు అందరిలో వస్తున్నాయి. కొందరేమో చికెన్ మంచిదని చెబుతారు. మరికొందరేమో మటన్ మంచిదని వాదిస్తుంటారు. చికెన్ తింటే వేడి చేస్తుందని మరో వాదన తెస్తుంటారు. మటన్ అయితేనే మన ఆరోగ్యానికి మంచిదనే తర్కిస్తారు. కానీ రెండింటిలో కూడా కొవ్వు ఉంటుంది. అది మనకు హాని చేసేదే. కానీ మాంసాహార ప్రియులు ఎక్కువగా కాకుండా మితంగా తీసుకుంటే ఎలాంటి ఆపద ఉండదు. అంతేకాని అదేపనిగా ప్రతిరోజు తింటే మాత్రం ఆలోచించాల్సిందే.
చికెన్ లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటే మటన్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మటన్ లో ఉదరభాగంలో ఉండే మాంసంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. చికెన్ లో కూడా ఉదర భాగంలోని మాంసానికి బలముంటుందని చెబుతున్నారు. అందుకే చికెన్ అయినా మటన్ కానీ ఉదర భాగంలోని మాంసాన్ని తింటేనే మనకు మంచిదనే అభిప్రాయం వస్తోంది. అయితే అమితంగా కాకుండా మితంగా తీసుకుంటే ఎలాంటి హాని ఉండదు. ఏ నెలకొకసారి తీసుకుంటే సరిపోతుంది. అంతేకాని ప్రతి వారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
చికెన్ లో తొడలు, రెక్కల భాగంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని తినకపోవడమే మంచిది. లేత మటన్ లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని చెబుతుండటంతో ముదిరిన దాని కంటే లేత మాంసం తీసుకోవడం ఉత్తమం. చికెన్, మటన్ కంటే చేపలు మంచివనే నిపుణులు చెబుతుంటారు. అందుకే చేపలు ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనమే. చికెన్, మటన్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కాకుండా దానికో సమయం కేటాయించుకుని తింటేనే మేలు జరుగుతుంది. లేకుంటే కీడే జాగ్రత్త పడాలి.
మాంసాహారం విషయంలో మితమే మంచిది. అతి అనర్థమే. దొరికింది కదాని తెగ తింటే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. మాంసాహారం మీద మనసును కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడూ కాకుండా ఎప్పుడో ఒకప్పుడు తింటే ఇబ్బందులు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనే విషయం గ్రహించుకోవాలి. లేకపోతే చిక్కులు వచ్చి సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి.