Vastu Tips: కలియుగంలో దానధర్మాలు చేయడం ఎంతో మంచిదని ధర్మ శాస్త్రం చెబుతోంది. అందుకే మన స్థాయికి తగ్గట్టుగా ఇతరులకు దానధర్మాలు చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలను అందుకోవచ్చు. ఇలా దానం చేసేటప్పుడు కూడా కొన్ని విషయాలను తెలుసుకొని దానం చెయ్యాల్సి ఉంటుంది. అయితే దానం చేసేటప్పుడు పొరపాటున కూడా ఒక వ్యక్తికి ఈ క్రింది తెలిపిన వస్తువులను దానం చేయకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
దానాలలో అన్నింటి కన్నా అన్నదానం ఎంతో గొప్పది అని చెబుతారు.అందుకే అన్నదానం చేయడం వల్ల ఎంతో మంచి పుణ్యఫలం లభిస్తుంది. అయితే పొరపాటున కూడా చెడిపోయిన అన్నం ఇతరులకు దానం చేయకూడదు.ఈ విధంగా ఇతరులకు చెడిపోయిన అన్నం దానం చేయటం వల్ల మన జీవితమే చెడిపోతుందని నిపుణులు చెబుతున్నారు.మన ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ లేదా ఇత్తడి పాత్రలను దానం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న సుఖసంతోషాలు కూడా వెళ్లిపోతాయి. అందుకే ఇలాంటి పాత్రలు దానం చేయకూడదు.
Also Read: Ram Charan- NTR RRR Movie Review: ఆర్ఆర్ఆర్: ఇది సగటు ప్రేక్షకుడి రివ్యూ
ఇక మన ఇంట్లో ఉపయోగించిన నూనెను ఇతరులకు దానం చేయడం వల్ల కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే. ఇక చాలామంది పుస్తకాలను గ్రంథాలను కూడా ఇతరులకు దానం చేస్తుంటారు. ఇలా వాడిన పుస్తకాలను చిరిగిపోయిన పుస్తకాలు గ్రంథాలను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు.ఇకపోతే మనం ఇంట్లో వాడుతున్న చీపురను ఇతరులకు దానం ఇవ్వటం కూడా మంచిది కాదు. చీపురుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు అలాంటి చీపురుని ఇతరులకు ఇవ్వటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇతరులకు దానం చేసినట్లు.ఇక ఇంట్లో విరిగిపోయిన పాడైపోయిన కుర్చీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇతరులకు దానం చేయడం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అందుకే పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికీ దానం చేయకూడదు.
Also Read: RRR Movie Review: రివ్యూ : ‘ఆర్ఆర్ఆర్’