చదువుకుంటున్న పిల్లలు ఈ 5 టిప్స్ పాటిస్తే ఎగ్జామ్స్ లో అనుకున్న మార్కులు తప్పకుండా సాధిస్తారు !

Exams Tips: ప్రస్తుతం విద్యార్థులందరికీ పరీక్ష సమయం కావడంతో పరీక్షలలో మంచి మార్కులు సాధించడం కోసం విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు.అయితే కొందరు ఎంత చదివినా పరీక్షల సమయంలో అధిక ఆందోళన చెందటం వల్ల వారు చదివినది కాస్తా మర్చిపోతూ ఉంటారు. మరి పరీక్షలలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి అనుకున్న మార్కులు సాధించాలంటే కొన్ని రకాల టిప్స్ పాటించడం ఎంతో మంచిది. మరి ఆ టిప్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…. పరీక్షలలో మంచి మార్కులు సాధించాలంటే […]

Written By: Kusuma Aggunna, Updated On : March 21, 2022 10:56 am
Follow us on

Exams Tips: ప్రస్తుతం విద్యార్థులందరికీ పరీక్ష సమయం కావడంతో పరీక్షలలో మంచి మార్కులు సాధించడం కోసం విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు.అయితే కొందరు ఎంత చదివినా పరీక్షల సమయంలో అధిక ఆందోళన చెందటం వల్ల వారు చదివినది కాస్తా మర్చిపోతూ ఉంటారు. మరి పరీక్షలలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి అనుకున్న మార్కులు సాధించాలంటే కొన్ని రకాల టిప్స్ పాటించడం ఎంతో మంచిది. మరి ఆ టిప్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

పరీక్షలలో మంచి మార్కులు సాధించాలంటే మనం పరీక్షలకు ముందు రోజులు మాత్రమే ఎక్కువ కష్టపడి చదివినంత మాత్రాన పరీక్షలో మార్కులు ఎక్కువగా రావు. పరీక్షలకు రెండు నెలల ముందు నుంచి ముందుగా మన రోజువారి పనులలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రాస్తారు. ఈ మూడు గంటల సమయం పాటు మన బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇలా ఈ మూడు గంటలు బ్రెయిన్ యాక్టివ్ గా ఉండటానికి మనం రెండు నెలల ముందు నుంచి అలవాటు చేసుకోవాలి.

Also Read: Is Rice Cooker Bad For Health: రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..

ఉదయమే నిద్ర లేచి కరెక్ట్ గా ఒకే సమయానికి టిఫిన్ చేయాలి. అలాగే 9 నుంచి 12 గంటల వరకు తప్పనిసరిగా ఏదో ఒకటి చదవడం, రాయడం వంటివి చేస్తూ మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉండడం అలవాటు చేసుకోవాలి.ఇలా పరీక్షకు రెండు నెలల ముందు నుంచి ఇదే పద్ధతిని అనుసరిస్తే పరీక్ష సమయంలో ఎలాంటి కంగారు ఆందోళన లేకుండా పరీక్షలు రాసి మంచి మార్పులను సంపాదించుకోవచ్చు. అందుకే పరీక్షకు రెండు నెలల ముందు నుంచి ఒకే టైంకి నిద్రలేవడం ఒకే టైంకి పడుకోవడం ఓకే టైంకి చదవడం వంటివి అలవాటు చేసుకోవటం వల్ల పరీక్ష సమయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించడంతో మనకి మంచి మార్కులు వస్తాయి.అలా కాకుండా పరీక్ష సమయంలో తెల్లవార్లు చదువుతూ పరీక్ష రాయడానికి హడావిడిగా వెళ్లడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.

Also Read: Palmistry: అరచేతిలో x అనే గుర్తు ఉందా.. అయితే మీరు అత్యంత ప్రతిభావంతులు