https://oktelugu.com/

డిగ్రీ పాసైనవాళ్లకు శుభవార్త.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు..?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగ అభ్యర్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 100 ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. Also Read: ఈ పాస్‌వర్డ్‌ లు వాడుతున్నారా.. ప్రమాదంలో పడినట్లే..? డిగ్రీ పాసైన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 11, 2021 / 03:30 PM IST
    Follow us on

    పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగ అభ్యర్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 100 ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

    Also Read: ఈ పాస్‌వర్డ్‌ లు వాడుతున్నారా.. ప్రమాదంలో పడినట్లే..?

    డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.pnbindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపులు ఉంటాయి.

    Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే ఛాన్స్..?

    నెలకు 48,170 రూపాయల నుంచి 69,810 రూపాయల వరకు ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతనంగా లభిస్తుంది. https://www.pnbindia.in/ వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయ్యి ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు వెబ్ సైట్ లో దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకుని సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు దరఖాస్తు ఫీజుకు సంబంధించిన వోచర్ ను జత చేయాల్సి ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా chief manager (recruitment section), hrm division, punjab national bank, corporate office plot no 4, sector 10, dwarka , new delhi – 110075 అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.