October 25 Solar Eclipse: ప్రపంచంలో రెండు గ్రహణాలు ఉంటాయి. ఒకటి సూర్య గ్రహణం, రెండోది చంద్రగ్రహణం. ఇవి ఆరు నెలలకోసారి వస్తుంటాయి. దీంతో గ్రహణం సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదనే దానిపై మనకు నిపుణులు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారు. గ్రహణాల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు. కొన్ని పనులు చేయాలి. అవేంటో తెలుసుకుని మసలుకోవాలి. గ్రహణ సమయంలో మన పూర్వీకుల నుంచి ఇప్పటి దాకా ఎన్నో సలహాలు, సూచనలు చేశారు.
గ్రహణం సమయంలో చేయకూడని పనులు ఏంటో తెలుసా? ఆ సమయంలో భోజనం చేయకూడదు. గ్రహణం ప్రారంభమై ముగిసే దాకా ఎలాంటి పదార్థాన్ని ముట్టుకోకూడదు. గ్రహణ సమయంలో దానం, జపం చేసే వారు ప్రారంభంలోనే పట్టుస్నానం చేయాలి. గ్రహణం విడిచిన తరువాత ఇంటిని శుద్ధిచేయాలి. తరువాత ఇంటిల్లిపాది స్నానాలు ముగించాలి. స్వాతి నక్షత్రం, తుల రాశి, కేతువు గ్రహం కలిగిన వారు సూర్యగ్రహణాన్ని చూడకూడదు. దోష పరిహారంలో భాగంగా మరునాడు శివాలయ దర్శనం, అభిషేకం చేయించుకోవాలి. మీన, కర్కాటక, తుల, వృశ్చిక రాశుల వారు కూడా ఈ పరిహారం చేసుకుంటే ఉత్తమం.
గ్రహణం సందర్భంగా అన్ని దేవాలయాలు మూసివేసి ఉంచుతారు. మరుసటి రోజు సంప్రోక్షణ చేసి తరువాత పూజా కార్యక్రమాలు చేపడతారు. ఈనెల 25న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8 గంటల లోపు ఆలయాలు మూసి వేసి 26న తెరుస్తారు. శుద్ధిచేసిన తరువాత ఆలయాన్ని తెరిచి భక్తులను అనుమతిస్తారు. సూర్య గ్రహణం ఉన్నందున దీపావళి పండుగను 24నే జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సూర్యగ్రహణం రోజు మంగళవారం మధ్యాహ్నం 2.28 గంటలకు మొదలై సాయంత్రం 6.32 గంటల వరకు గ్రహణం ఉంటుంది.
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం చివరి గ్రహణంగా దీన్ని పేర్కొంటున్నారు. సూర్య గ్రహణం సందర్భంగా ప్రజలు కూడా కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. గ్రహణ సమయంలో మన పూర్వీకులు చెప్పిన వాటిని తూచ తప్పకుండా పాటించాలి. గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. అద్దంలో కాని టెలిస్కోపులో కాని చూడాలి. కానీ ప్రత్యక్షంగా చూస్తే మన కళ్లకు ప్రతిబంధకంగా మారనుందని చెబుతున్నారు. అందుకే గ్రహణాలను డైరెక్టుగా చూడకుండా పరోక్షంగా చూడాలి. ఈ జాగ్రత్తలు పాటించి గ్రహణ సమస్యల నుంచి బయట పడాలని చెబుతున్నారు.