https://oktelugu.com/

Parle -G Biscuit Packet: పార్లే – జి బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న ఆ చిన్నారి ఎవరో తెలుసా?

Parle -G Biscuit Packet: చిన్న పిల్లలకు బిస్కెట్లు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నో రకాల కంపెనీలకు చెందిన బిస్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే గతంలో ఎక్కువగా పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ లకు ఎంతో మంచి ఆదరణ ఉండేది. ఎక్కువమంది ఈ బిస్కెట్లను తినడానికి ఎంతో ఇష్టపడేవారు.గత కొన్ని దశాబ్దాల నుంచి అందుబాటులో ఉన్న పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న చిన్నారి గురించి గతంలో ఎన్నో వార్తలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 25, 2022 / 10:26 AM IST
    Follow us on

    Parle -G Biscuit Packet: చిన్న పిల్లలకు బిస్కెట్లు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నో రకాల కంపెనీలకు చెందిన బిస్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే గతంలో ఎక్కువగా పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ లకు ఎంతో మంచి ఆదరణ ఉండేది. ఎక్కువమంది ఈ బిస్కెట్లను తినడానికి ఎంతో ఇష్టపడేవారు.గత కొన్ని దశాబ్దాల నుంచి అందుబాటులో ఉన్న పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న చిన్నారి గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.

    పార్లే జీ బిస్కెట్ ప్లాంట్ ను 1929 ముంబైలోని విలే పార్లే లో మొదటిసారిగా స్థాపించారు. మొదటి సారి 12 మందితో ప్రారంభమైన ఈ ప్లాంట్ అనంతరం బాగా అభివృద్ధి చెందింది. ఇక ఈ బిస్కెట్ ప్యాకెట్ ప్లాంట్ పార్లే అనే నగరంలో పెట్టడం వల్ల పార్లే జి అనే పేరు వచ్చింది. జి అంటే గ్లూకోజ్ గా పేరు పెట్టాడు. ఆ తర్వాత పార్లే జి అంటే జీనియస్ అంటూ పేరు మారుస్తూ వచ్చారు. ఇక బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న చిన్నారి గురించి పలు సార్లు వార్తలు వచ్చాయి. ఈ ప్యాకెట్ పై ఉన్న చిన్నారి నీరూ దేశ్పాండే, సుధా మూర్తి, గుంజన్ గుండానియా వంటి వారి పేర్లు వినిపించాయి.

    నీరూ దేశ్పాండే నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె ఫోటోని ఇలా పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ పై వేశారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై బిస్కెట్ కంపెనీ యాజమాన్యం స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్నది ఎవరు కాదు అది ఒక ఊహా గాన చిత్రమని క్రియేటివ్ ఏజెన్సీ వారు ఈ చిత్రాన్ని క్రియేట్ చేశారని పార్లే జి వెల్లడించింది.