https://oktelugu.com/

Ram Charan- NTR RRR Movie Review: ఆర్ఆర్ఆర్: ఇది సగటు ప్రేక్షకుడి రివ్యూ

Ram Charan- NTR RRR Movie Review: సినిమా అంటే ఇన్నాళ్లు హాలీవుడ్ పేరే చెప్పుకునేవారు.. కొన్నాళ్లు బాలీవుడ్ సినిమాలను చూపించేవారు. కానీ మన జక్కన్న చెక్కుడుకు ఇప్పుడు తెలుగు సినిమా వైపే అందరూ చూపిస్తున్నారు. ఒక ప్రాంతీయ సినిమాను ఎల్లలు దాటించే ప్రపంచమంతా వివిధ వర్గాల వారిని ఆకట్టుకునేలా తీసిన ఘనత రాజమౌళిదే.. అందుకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు అంత ఆదరణ వచ్చింది. అంతలా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన సగటు ప్రేక్షకుడిని […]

Written By:
  • NARESH
  • , Updated On : March 25, 2022 / 10:30 AM IST
    Follow us on

    Ram Charan- NTR RRR Movie Review: సినిమా అంటే ఇన్నాళ్లు హాలీవుడ్ పేరే చెప్పుకునేవారు.. కొన్నాళ్లు బాలీవుడ్ సినిమాలను చూపించేవారు. కానీ మన జక్కన్న చెక్కుడుకు ఇప్పుడు తెలుగు సినిమా వైపే అందరూ చూపిస్తున్నారు. ఒక ప్రాంతీయ సినిమాను ఎల్లలు దాటించే ప్రపంచమంతా వివిధ వర్గాల వారిని ఆకట్టుకునేలా తీసిన ఘనత రాజమౌళిదే.. అందుకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు అంత ఆదరణ వచ్చింది. అంతలా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన సగటు ప్రేక్షకుడిని ఫిదా చేసింది. సినిమా గురించి సగటు ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడో ఇప్పుడు చూద్దాం..

    Ram Charan- NTR RRR Movie Review

    ఆర్ఆర్ఆర్.. రామచరణ్ నట విశ్వరూపానికి తార్కాణం ఆర్ఆర్ఆర్ మూవీ.. సహనటుల్ని అందులోనూ జూ ఎన్టీఆర్ లాంటి ప్రూవ్డ్ యాక్టర్స్ ని కూడా డామినేట్ చేసేసాడు. ఇది మల్టీ స్టారర్ ఆ? కాదా అన్న అనుమానం న్యూట్రల్ ప్రేక్షకులకు కలగించాడు. రాంచరణ్ సినిమా అంతా తనే అయ్యి భుజాలకి ఎత్తుకుని నడిపించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఆహార్యంలో కానీ, నటనలో కానీ, ఫైట్స్ లో కానీ 100కి 100 శాతం మార్కులు కొట్టేశాడు. రామ్ చరణ్ నట జీవితంలో ఆర్ఆర్ఆర్ కి ముందు తర్వాత అనేటట్టు ఈ సినిమా ఉంది

    Also Read: మహేష్ తో రాజమౌళి మూవీ కథ అలా ఉంటుందట.. ఓపెన్ అయిన విజయేంద్రప్రసాద్

    ఆర్ఆర్ఆర్ తర్వాత రాబోయే సినిమా దర్శకుల మీద విపరీతమైన ఒత్తిడి ని పెట్టేసినట్టే. తెలుగు సినిమా ఈ తరం మెగాస్టార్ గా రాంచరణ్ ను అనటంలో ఎటువంటి సందేహం లేకుండా చేసిన సినిమా ఆర్ఆర్ఆర్. పౌరాణిక పాత్రలని కూడా మెప్పించగలడు రాంచరణ్ అని ఈ సినిమాతో నిరూపించబడింది. రాజమౌళి కనక భవిష్యత్తు లో మహాభారతం తీసే ఉద్దేశ్యం ఉంటే మెయిన్ కాస్టింగ్ కి ఢోకా లేదని ఈ సినిమా తేల్చిచెప్పింది.

    కథ కి కథనానికి సినిమా కి ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు రాజమౌళి, మల్టీ స్టారర్.. అందులోను ఇద్దరు అగ్రనటులతో, తీసిన సినిమా. ఇద్దరు హీరో లని బాలన్స్ చెయ్యాలి ..హీరో ల ఇమేజ్ లని దృష్టిలో పెట్టుకోవాలి , అభిమానుల ఘర్షణ లేకుండా చూసుకోవాలి లాంటివేమి పెట్టుకోకుండా కథకి తగ్గట్టు ఏ పాత్ర కి ఎంత న్యాయం చెయ్యాలో అంతే చేసేట్టు మొత్తం తీర్చిదిద్దారు. ఎమోషనల్ డ్రామా లో కింగ్ అయిన రాజమౌళి మరొకసారి తన మార్కు చూపించారు. భారీతనం అంతా కొట్టొచ్చినట్టు కనపడింది. పాటలు సినిమా కి అడ్డం అనుకున్నట్టు ఉన్నారు. అందుకే అంతగా వాటికి స్కోప్ ఇవ్వలేకపోయాడు.

    రాజమౌళి తో ఉన్న అనుబంధం వలన కావొచ్చు , రామ్ చరణ్ తో ఉన్న ఫ్రెండ్షిప్ వలన కావొచ్చు ..లేదా ఈ కథకి తనకి ఇచ్చిన పాత్ర పరిధి అంతే అవ్వటం మూలానో, జూ ఎన్టీఆర్ (భీమ్) కొంత రామరాజు నీడలోనే ఉండాల్సి వచ్చింది. భేషజం లేకుండా తను నటించడం తెలుగు సినిమా కి శుభ పరిణామం. సోలో షాట్స్ ఉన్నప్పుడు తన పాత్ర మేరకు నటించినా , రామ్ చరణ్ తో ఉన్న కాంబినేషన్ సీన్స్ అన్నిటిలోనూ రాంచరణ్ ఆదేశాలు పాటించే/లేదా అనుసరించే సపోర్టింగ్ యాక్టర్ గా జూ ఎన్టీఆర్ నటన తప్పు పట్టలేనట్టు గా కొనసాగింది. తన ఫాన్స్ కి కొంత నిరుత్సాహం కలిగించే అంశం అయినప్పటికీ.. ఎన్టీఆర్ మెచూరిటీ ని అభినందించకుండా ఉండలేము

    Ram Charan- NTR RRR Movie Review

    ఉన్న ఇద్దరు హీరోలకే సినిమా ప్రెజన్స్ సరిపోక పోవడం వలన కావొచ్చు , హీరోయిన్లకి పెద్ద ప్రాధాన్యం లభించలేదు. ముఖ్యంగా హిందీ నుంచి తెచ్చిన అలియా కి కానీ , శ్రేయ కి కానీ. కాస్తో కూస్తో ఆంగ్ల తార ఒలీవియా స్క్రీన్ మీద ఎక్కువ సేపు కనిపించలేకపోయారు.. ఫ్లాష్ బాక్ లో వచ్చిన అజయ్ దేవగణ్ మార్కులు కొట్టేశాడు. మిగతా అంతా వచ్చిపోయే యాక్టర్లే..

    మొత్తం మీద R (రామ్ చరణ్) R (రాజమౌళి) R (రామారావ్) ల సుదీర్ఘ నిరీక్షణ , కష్టం అనుకున్న ఫలితాలనే ఇచ్చింది.. వచ్చే పదేళ్ళలో రామ్ చరణ్ దగ్గరకి కూడా ఇంకెవరు రాకుండా చేసిన సినిమా

    Also Read: RRR Movie Review: రివ్యూ :  ‘ఆర్ఆర్ఆర్’

     

    Recommended Video:

    Tags