Wife And Husband: భార్య భర్తలు అన్న తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు అలా దాపరికాలు లేనప్పుడే ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంటుందనీ పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొన్ని విషయాలు భర్త దగ్గర చెప్పటం వల్ల చివరికి వారి బంధం బీటలు వారే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని విషయాలు భర్త దగ్గర చెప్పకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి భర్త దగ్గర భార్య చెప్పకూడని ఆ విషయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
భర్త కుటుంబాన్ని విమర్శించకూడదు:చాలా మంది భార్యలు తన భర్త కుటుంబ సభ్యులను విమర్శిస్తూ తీవ్రస్థాయిలో గొడవలు పడుతుంటారు. అయితే ఎప్పుడూ కూడా భర్త కుటుంబ సభ్యులు మనకు నచ్చకపోతే వారి గురించి పట్టించుకోవడం మానేయాలి. వారి గురించి మీ భర్త దగ్గర విమర్శించడం వల్ల మీ బంధానికి బీటలు బారే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా భార్య భర్త దగ్గర తన కుటుంబాన్ని విమర్శించకూడదు.
లవ్ ఎఫైర్స్: గతంలో మనకు ఇతర వ్యక్తులతో ఉన్న ప్రేమ అలాగే వారితో ఉన్నటువంటి లైంగిక సంబంధం గురించి చెప్పకూడదు.ఎంత మంచి భర్త అయిన పెళ్లికి ముందు తన భార్యకు ఒక లవర్ ఉన్నాడు అంటే సహించడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు కొట్లాటలు మొదలవుతాయి.
భర్తలో లోపాలు: మీ భర్తలో ఉన్నటువంటి లోపాలను ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర ప్రస్తావించకూడదు. అలాగే మాటిమాటికీ లోపాలను ఎత్తి చూపించడం వల్ల వారు ఎంతో అసహనానికి గురవుతూ ఇద్దరి మధ్య గొడవలు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి.
Also Read: RRR Movie Box Office Collection Worldwide: అఫీషియల్ : ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే
ఇతరుల మాటలు నమ్మకూడదు: మన కుటుంబంలో ఎవరైనా మన భర్త గురించి మాట్లాడుతూ నీ భర్త ఇలాంటి వాడు అలాంటివాడు అని చెప్పినప్పుడు ఆ మాటలు విని ఆ విషయాలను భర్త దగ్గర ప్రస్తావించ కూడదు. ఇలా ప్రస్తావించినప్పుడు అసలు సమస్యలు మొదలవుతాయి. ఇలా మొదలైన సమస్య చివరికి విడిపోయే పరిస్థితులను కూడా కల్పిస్తుంది.
డబ్బు గురించి చర్చించడం: జీవితంలో ముందుకు వెళ్లాలంటే డబ్బు ఎంతో అవసరం అయితే ప్రతి ఒక్క పనిని వస్తువును డబ్బుతో ముడిపెట్టడం సరైనది కాదు భార్యాభర్తలిద్దరూ కలిసి డబ్బులు సేవ్ చేసుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి కానీ తరచూ డబ్బు గురించి ప్రస్తావించడం వల్ల సమస్యలు మొదలవుతాయి.
Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరోలు, ప్రముఖులు ఏమన్నారంటే?