దేశంలో కమ్యూనికేషన్ కోసం ఎక్కువమంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ సహాయంతో అన్ని పనులను వేగంగా చేయడం సాధ్యమవుతుంది. మానవుల జీవితంలో స్మార్ట్ ఫోన్ కూడా భాగమైందనే సంగతి తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత సైబర్ మోసాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న మోసాల నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఫోన్లలో ఇన్ బిల్ట్ ప్రొటెక్షన్ టూల్స్ ను అందుబాటులోకి తెచ్చాయి.
ఆండ్రాయిడ్ ఫోన్ లాకింగ్ ఫీచర్లలో స్క్రీన్ లాక్ ఒకటి కాగా ఫేస్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, పాస్ వర్డ్, ప్యాట్రన్, పిన్ లను పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ల ద్వారా ఫోన్ కు భద్రత ఉండటంతో పాటు ఇతరులకు ఫోన్ దొరికినా ఆ ఫోన్ ను యాక్సెస్ చేయడం తేలిక కాదు. ఫోన్ లాక్ చేసిన తర్వాత స్క్రీన్ పై ఎలాంటి నోటిఫికేషన్లు కనిపించాలో కూడా ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఆండ్రాయిడ్ 11 ఆపై ఓఎస్ లలో పని చేసే ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్ ఫోన్ ను పోగొట్టుకుంటే ఫైండ్ మై డివైస్ సహాయంతో సులభంగా ఫోన్ ను కనిపెట్టవచ్చు. సెట్టింగ్స్ లోని సెక్యూరిటీఓ ఫైండ్ మై డివైజ్ అనే ఆప్షన్ ను ఎనేబుల్ చేయాలి. ఇతరులు యాక్సెస్ చేయకుండా ఫోన్ ను ఫైండ్ మై డివైజ్ వెబ్ సైట్ నుంచి బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఫోన్ లో స్మార్ట్ లాక్ ఫీచర్ ను ఎనేబుల్ చేస్తే అనుమతించిన ప్రదేశాలు, డివైజ్ ల దగ్గరకు వెళ్లినప్పుడు ఫోన్ అన్ లాక్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 ఆపై వెర్షన్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని సమాచారం.