AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గింకుందా? పేరుకే అభ్యంతరాలపై నోటిఫికేషన్లు ఇచ్చినా ఎక్కడా వాటిని పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవా? తమ ప్రాంతాలకు అనుగుణంగా రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా..మార్పులు చేయాలని విన్నవించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వం మొండిగా ముందుకు పోవడం విమర్శలకు తావిస్తొంది. ప్రజా సంఘాలు, విపక్షాలు, రాజకీయ పక్షాలు ఆందోళనలను పట్టించుకోకుండా ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పై తుది నోటిఫికేషన్లు సిద్ధమయ్యంది. వాటిని ఏ క్షణమైనా విడుదల చేసేందుకు రెవెన్యూశాఖ అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది.
AP New Districts
జనవరి 25న సీసీఎల్ఏ విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ల ఆధారంగా మొత్తం 26 జిల్లాలు ఉండనున్నాయి. ప్రతి లోక్‌సభ స్థానాన్నీ జిల్లాగా ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరుకుంది. రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కి చేరనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 52 రెవెన్యూ డివిజన్లు ఉండగా… అందులో ఎటపాక, కుక్కునూరు డివిజన్లను ఇప్పుడు రద్దుచేశారు. కొత్తగా మరో 23 డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు.
Also Read: AP Electric Charges Hiked: ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచితే ఖబడ్దార్.. వైసీపీకి పవన్ కల్యాణ్ హెచ్చరిక
జనవరి 25న ప్రకటించిన 15 కొత్త డివిజన్లపై తుది నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తాజాగా ప్రకటించిన పలాస, చీపురుపల్లి, కొత్తపేట, ఉయ్యూరు, సత్తెనపల్లి, నగరి, శ్రీకాళహస్తి, పత్తికొండ.. ఈ ఎనిమిది డివిజన్లపై కొత్తగా అభ్యంతరాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది.అధికారులు ఇలా ప్రాథమిక నోటిఫికేషన్లు ఇస్తారా.. లేక జిల్లాలనే ప్రామాణికంగా తీసుకుని అన్నింటిపైనా తుది నోటిఫికేషన్లు జారీచేస్తారా అన్నది తేలాల్సి ఉంది. విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం.. జిల్లాలనే యూనిట్‌గా తీసుకుని తుది నోటిఫికేషన్లు తయారు చేసినట్లు తెలిసింది. ధర్మవరం, కదిరి, కందుకూరు రెవెన్యూ డివిజన్లను కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసింది. కాగా.. మొత్తం 26 జిల్లాల్లో 4 జిల్లాల పరిధిలో నాలుగేసి రెవెన్యూ డివిజన్లు.. 13 జిల్లాల పరిధిలో మూడేసి.. 9 జిల్లాల్లో రెండేసి డివిజన్లు ఉండనున్నాయి.
మూడేళ్లలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ ప్రభుత్వం దానిని ద్రుష్టి మరల్చేందుకే కొత్త జిల్లాల ఎత్తుగడను తెరపైకి తెచ్చిందన్న వాదన వినిపిస్తొంది. అసలు 13 జిల్లాలతో మెరుగైన పాలన అందించే అవకాశమున్నా.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపడుతోందన్న విమర్శలున్నాయి. ప్రధానంగా ఎస్టీ నియోజకవర్గాలను వేరుచేసి ప్రత్యేక జిల్లాల రూపకల్పన వెనుక పెద్ద స్కెచ్ దాగి ఉంది. గత ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ పూర్తిస్థాయిలో ఆధిపత్యం కనబరచింది. దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆ నియోజకవర్గాల్లో మైదాన ప్రాంత నేతల జోక్యం అధికమైంది. రిజర్వేషన్ తో ఎమ్మెల్యేలు అయినా వారు మాత్రం మైదాన ప్రాంత నేతల చెప్పుచేతల్లో ఉండేవారు.
JAGAN
ఎస్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం చూపి ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు బ్లాక్ మెయిల్ చేసేవారు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విశ్వసరాయి కళావతి ఉన్నారు. ఆమె ఎస్టీకి చెందిన వారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం కుటుంబానికి దాటి వెళ్లలేని దుస్థితి. పాలకొండ నియోజకవర్గంలో ఎస్టీలతో పాటు తూర్పు కాపులు అధికం. సహజంగా అక్కడ పాలవలస కుటుంబానికి మంచి పట్టు ఉంది. దీంతో ఎమ్మెల్యే అన్న మాటే కానీ.. చిన్నపాటి అభివ్రద్ధి పనుల ప్రారంభోత్సవం సైతం పాలవలస కుటుంబీకులు అనుమతితోనే ముందుకెళ్లాల్సిన పరిస్థితి. విజయనగరం జిల్లాలో కూడా సేమ్ సీన్. ఇక్కడ సాలూరు, కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు.
ఈ రెండు నియోజకవర్గాల్లో ఎస్టీలతో పాటు తూర్పుకాపు, వెలమ సామాజికవర్గాలు అధికం. కురుపాం నుంచి ఎన్నికైన పాముల పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఆ రెండు నియోజకవర్గాల్లో మరో జిల్లా మంత్రి బొత్సకే పట్టుంది. అందుకే ఆయనకు దాటి వెళ్తే తమ రాజకీయంగా మైనస్ అవుతామని భావించి డిప్యూటీ సీఎం తలవంచక తప్పడం లేదు. ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకే ప్రభుత్వం ఎస్టీ నియోజకవర్గాలను కలుపుతూ జిల్లాలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా సీనియర్లకు చెక్ చెప్పడంతో పాటు ఎస్టీల్లో నూతన నాయకత్వాన్ని తయారు చేయడం ద్వారా అధికారంలోకి రావాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. రెవెన్యూ డివిజన్ల పెంపును కూడా ప్రభుత్వం రాజకీయ లబ్ధికి వినియోగించుకుంటోంది.
Also Read: Jr.NTR : రాజకీయాల్లోకి రాకపై జూనియర్ ఎన్టీఆర్ హాట్ కామెంట్స్
Web Title: Final look andhra pradesh new districts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com