Lord Shiva: సాధారణంగా మనం శివాలయాలకు వెళ్లినప్పుడు చాలా మంది భక్తులు హర హర మహాదేవ అని స్వామి వారిని నమస్కరించడం చూస్తుంటాము. ఇక వారణాసిలో అయితే ఎక్కువగా మనకు ఇదే మంత్రం వినబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ మంత్రంతో స్వామివారిని పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుందని భావిస్తారు. అంతేకానీ హరహరమహదేవ అనే పేరుతో స్వామివారిని ఎందుకు పూజించాలి అనే విషయం గురించి చాలా మందికి తెలియదు. మరి స్వామి వారిని నమస్కరించి ముందు హరహరమహదేవ అని ఎందుకు నమస్కరిస్తారో ఇక్కడ తెలుసుకుందాం…
హిందూ పురాణాల ప్రకారం సృష్టి, స్థితి, లయ కారకులుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజిస్తాము. కానీ శైవులు శివుడిని మాత్రమే ఆరాధిస్తారు. కనుక దేవుళ్ళకే దేవుడిగా పరమశివుని పూజిస్తారు. ఈ విధంగా స్వామివారిని పూజించే టప్పుడు హరహరమహదేవ అనే మంత్రంతో నమస్కరించడానికి గల కారణం ఏమిటి అంటే… హర అంటే పాపాలను మొత్తం, హర అంటే తీసుకెళ్లేవాడు మహాదేవ అంటే దేవుళ్ళకే దేవుడు.హర హర మహాదేవ అంటే దేవుళ్ళకే దేవుడైన పరమశివుడు మన పాపాలను మొత్తం తీసుకెళ్తారని అర్థం.
అందుకే పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తిశ్రద్ధలతో హరహరమహదేవ అని స్వామివారిని నమస్కరించుకోవటం వల్ల మన పాపాలు మొత్తం హరించుకుపోతాయని పండితులు తెలియజేస్తున్నారు అందుకే శివుడిని ఎక్కువగా హరహరమహదేవ అని పూజిస్తారు.