Vykunta Ekadasi: నేడే వైకుంఠ ఏకాదశి… ఈ ఏకాదశి విశిష్టత ఏమిటో తెలుసా?

Vykunta Ekadasi: ప్రతి ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.ఈ వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు ముక్కోటి దేవతల తో కలిసి భూమి పైకి రావడం వల్ల ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.అదేవిధంగా ఈరోజు ఎవరైతే శ్రీహరిని భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాసాలతో పూజిస్తారో అలాంటి వారికి వారి పాపాల నుంచి మోక్షం కలుగుతుంది కనుక ఈ ఏకాదశిని […]

Written By: Navya, Updated On : January 13, 2022 9:47 am
Follow us on

Vykunta Ekadasi: ప్రతి ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.ఈ వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు ముక్కోటి దేవతల తో కలిసి భూమి పైకి రావడం వల్ల ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.అదేవిధంగా ఈరోజు ఎవరైతే శ్రీహరిని భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాసాలతో పూజిస్తారో అలాంటి వారికి వారి పాపాల నుంచి మోక్షం కలుగుతుంది కనుక ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. అలాగే సంతానం కావాలనుకుంటున్న వారు ఈ ఏకాదశి రోజున ఈ వ్రతం ఆచరించడం వల్ల వారికి పుత్ర సంతాన యోగం కలుగుతుందని ఈ ఏకాదశిని పుత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ విధంగా ఎంతో విశిష్టమైన ఈ ముక్కోటి ఏకాదశి తిథి సాయంత్రం వరకు ఉండటం వల్ల ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని స్నానమాచరించిన అనంతరం ఇంట్లో శ్రీహరి చిత్రపటానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అనంతరం శ్రీహరి ఆలయాలకు సందర్శించాలి. అయితే ఈ రోజు మొత్తం ఎవరైతే ఉపవాసంతో ఉంటారో అలాంటి వారిపై నారాయణుడి అనుగ్రహం ఉంటుందనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా స్వామివారికి తులసిమాలలతో పూజ చేసిన అనంతరం ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకోవాలి.

Vaikunta-Ekadasi 2022

ఈ క్రమంలోనే ఈ రోజు శ్రీహరి ఆలయాలలో ఉత్తర ద్వారం తెరిచి ఉంటారు.ఎవరైతే ఉత్తర ద్వారం కింద ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకుంటారో అలాంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం తో విష్ణుసహస్రనామాలు చదువుతూ స్వామివారి సేవలో ఉండాలి. అదేవిధంగా ఉపవాసంతో స్వామివారిని పూజ చేసే వారు కొన్ని నియమాలను కూడా పాటించాలి.

ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో అలాంటి వారు ఉపవాసంతో స్వామివారికి పూజ చేసే ఈ రోజు మొత్తం స్వామివారి సేవలో ఉండి పూజించుకోవాలి. అదేవిధంగా వ్రతమాచరించే వారు ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలాగే ఏకాదశి రోజు రాత్రి నేలపై పడుకోవాలి. ఏకాదశి ద్వాదశి రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశిరోజు ఉదయమే శుభ్రంగా స్నానమాచరించి భోజనం తయారు చేసి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన తర్వాత మీ ఉపవాసం విరమించాలి. ఈ విధంగా ఏకాదశి వ్రతంలో ఈ నియమాలను పాటించడం వల్ల స్వామివారి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి.