Architectural Tips: సాధారణంగా ప్రతి ఒక్క ఇంటిలో అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు తరచూ గొడవలు పడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఇటు తల్లికి,అటు భార్యకి చెప్పలేక భర్త ఎంతో సతమతమవుతుంటారు. ఈ విధంగా నిత్యం ఏదో ఒక గొడవ కారణంగా అత్తాకోడళ్ల మధ్య ఇలాంటి గొడవలు తగ్గిపోయి తల్లి కూతురులాగా కలిసి పోవాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటించాల్సిందే. మరి ఆ వాస్తు చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
తరచూ అత్తా కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉంటే వారి గదులలో ఎరుపురంగు ఫోటోలను పెట్టడం ఎంతో మంచిది. అలాగే అత్తా కోడలు కలిసి ఉన్న ఫోటోని కూడాతరచు వారికి కనిపించే విధంగా పెట్టడం వల్ల వారి మధ్య కోపతాపాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక మహిళలు ఎక్కువగా ఇంట్లో నివసించే గది వంట గది. వంట గదిలో పొరపాటున కూడా నలుపురంగు ఉపయోగించకూడదు. నలుపురంగు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచుతుంది.కనుక నలుపురంగును ఉపయోగించకూడదు.
Also Read: Radhe Shyam Box Office Collection: బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ లేటెస్ట్ కలెక్షన్స్
ఇంట్లో చందనపు విగ్రహం ఉండటం వల్ల బంధాలను మరింత దృఢపరుస్తుంది. అందుకే ఎవరైతే అత్తా కోడలు గొడవలు పడతారో అలాంటి వారు వారి ఇంటిలో అందరికీ కనిపించే విధంగా చందనపు విగ్రహం పెట్టుకోవటం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో చెత్త వేసే డస్ట్ బిన్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఈ డస్ట్ బిన్ ఎల్లప్పుడు ఈశాన్య దిశలో ఉండాలి. ఇక ఇంటికి నైరుతి దిశలో ఎల్లప్పుడూ అత్త గారి గది ఉండాలి. ఇలా నైరుతిదిశలో అత్త గది ఉండటం వల్ల అత్తా కోడళ్ళ మధ్య ఏ విధమైన ఎటువంటి కలహాలు రావు.
Also Read: Caste Conspiracy Against Janasena Party : జనసేనపై కులం కుట్ర మొదలైందా?