రేపే శ్రావణ మాసం.. శ్రావణ మాసం విశిష్టత.. చేయాల్సిన పూజలు ఇవే!

మన హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు 12 నెలలలో 5వ నెలను శ్రావణ మాసం అంటాము. మన తెలుగు 12 నెలలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఎంతో ప్రత్యేకమైన శ్రావణమాసం ఈ ఏడాది ఎప్పుడు వస్తుంది? శ్రావణమాసం విశిష్టత.. శ్రావణ మాసంలో ఏ విధమైనటువంటి పూజలు చేస్తారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం… మన హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబర్ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 8, 2021 9:12 pm
Follow us on

మన హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు 12 నెలలలో 5వ నెలను శ్రావణ మాసం అంటాము. మన తెలుగు 12 నెలలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఎంతో ప్రత్యేకమైన శ్రావణమాసం ఈ ఏడాది ఎప్పుడు వస్తుంది? శ్రావణమాసం విశిష్టత.. శ్రావణ మాసంలో ఏ విధమైనటువంటి పూజలు చేస్తారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

మన హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఉంటుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ శ్రావణ మాసంలో మహిళలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు నోములు వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈ విధంగా అమ్మవారికి పూజలు చేస్తూ కొంత మంది భక్తులు ఈ నెల మొత్తం ఎలాంటి మాంసాహారాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు.

ఈ నెలలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలకు ఎంతో ప్రత్యేకతమైన రోజులుగా చెప్పవచ్చు. ఈ రోజులలో భక్తులు ఉపవాస దీక్షలలో ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు పరమశివుడికి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.శ్రావణ మాసంలో లక్ష్మి దేవి విష్ణుమూర్తితో అలిగి సముద్రంలో ఉంటుంది. ఈ క్రమంలోనే దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్నప్పుడు సముద్రం నుంచి లక్ష్మీదేవి కన్నా ముందుగా విషం బయటకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన విషాన్ని ఆ పరమేశ్వరుడు తాగి ఆ విషయాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల పరమేశ్వరుడికి శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.

అదేవిధంగా శ్రావణమాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా పార్వతీదేవికి పసుపు కుంకుమలతో వివాహితులు తమ మాంగల్యబంధం పదికాలాలపాటు పచ్చగా ఉండాలని మంగళగౌరీ వ్రతం చేస్తారు. ఈ విధంగా శ్రావణ మాసాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తారు.