Shiva Pooja On Monday: మన హిందూ పురాణాల ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ క్రమంలోనే సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావించి ఆ పరమశివుడికి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే సోమవారం పరమేశ్వరుడిని పూజించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. హిందీలో సోమ్ అంటే చంద్రుడు అని అర్థం. సోమవారం అంటే చంద్రుడికి ఎంతో ఇష్టమైన రోజు. పురాణాల ప్రకారం చంద్రుడికి సోమవారానికి మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందని తెలుస్తుంది.
Also Read: వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే!
పురాణాల ప్రకారం దక్ష మహారాజు అనే రాజుకు 27 మంది పుత్రికలు ఉన్నారు. 27 మంది చంద్రుడిని పెళ్లి చేసుకుని చంద్రుడి చుట్టూ ఆకాశంలో తారలుగా ఉంటారు. అయితే చంద్రుడు 27 మందిలో రోహిణితో ఎంతో ప్రేమగా ఉండటం వల్ల మిగిలిన వారందరూ తన తండ్రి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. ఈ క్రమంలోనే చంద్రుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేసిన వినకపోవడంతో దక్ష మహారాజు చంద్రుడికి శాపం పెడతాడు. రోజురోజుకు నీలో ఉన్న శక్తి తగ్గిపోతుందని శాపం ఇచ్చారు.తన తప్పు తెలుసుకున్న చంద్రుడు బ్రహ్మదేవుడిని సహాయం చేయమని కోరగా తనకు కేవలం పరమేశ్వరుడు మాత్రమే రక్షించగలడని చెబుతాడు.
ఈ క్రమంలోనే పరమేశ్వరుడి కోసం తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు నెలలో తన శక్తి 15 రోజులు క్షీణించిపోతే తిరిగి 15 రోజులు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతావని వరమిచ్చాడు. దీంతో చంద్రుడికి సహాయం చేసినందుకు గాను శివుడిని చంద్రుడికి ఎంతో ఇష్టమైన సోమవారం రోజున పూజిస్తారు. అందుకే పరమేశ్వరుడిని సోమనాథుడు అని చంద్రశేఖరుడు అనే పేర్లతో పిలుస్తారు.
Also Read: దీపాలను వెలిగించడంలో ఏ నియమాలు ఉన్నాయో తెలుసా.. పూర్తి వివరాలతో?