Sankranthi Festival: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు వైభవంగా సంక్రాంతి పండుగ జరుపుకునేందుకుగాను సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అందరూ తమ సొంత ఊళ్లకు చేరుకోగా, మరి కొందరు తమ ప్రయాణాలు స్టార్ట్ చేశారు. ఎంచక్కా హాయిగా సంక్రాంతి పర్వ దినాన కుటుంబ సభ్యులతో గడపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దేశమంతా ఈ నెల 14న సంక్రాంతి పండుగ జరుపుకోనున్నారు. అయితే, ఇక్కడే ట్విస్టు ఉంది. దేశమంతా 14న సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు సమాయత్తమవుతుండగా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి పండుగ ఈ నెల 15న జరుపుకోవాలని పంచాంగ కర్తలు చెప్తున్నారు.
పంచాంగ కర్తలు చెప్తున్న విషయం తెలుసుకుని కొందరు అయితే సందిగ్ధంలో పడిపోయారు. ఇంతకీ 14న పండుగ జరుపుకోవాలా? లేదా 15న పండుగ జరుపుకోవాలా? అని అడుగుతున్నారు. అయితే, నిజానికి ప్రతీ సంవత్సరం పండుగ 13, 14, 15 తేదీల్లో వస్తుంటుంది. అలా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలు హ్యాపీగా జరుపుకుంటారు కూడా. అయితే, ఈ సారి మాత్రం అలా కాకుండా 15న సంక్రాంతి జరుపుకోవాలని దేవ స్థాన పండితులు కొందరు, పంచాంగ కర్తలు చెప్తున్నారు. దాంతో కొంత అయోమయం అయితే నెలకొంది.
Also Read: కూతురు బర్త్ డేలో కోహ్లీ ఏం చేశాడంటే?
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్రాంతి శోభ వచ్చేసింది. జనాలందరూ పిండి వంటకాలు చేయడం స్టార్ట్ చేసేశారు. కొందరు అయితే వంటకాలు చేసుకున్నారు కూడా. పిల్లలు ఎంచక్కా హాయిగా పతంగులు ఎగురవేస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. పండుగ ఎప్పుడనే మీమాంస మాత్రం ఇంకా ఉంది. ప్రముఖ పంచాంగ కర్త శ్రీనివాస గార్గేయ మాత్రం జనవరి 14న 2.29 గంటలకు సంక్రాంతి పండుగ ప్రవేశిస్తుందని అంటున్నారు.
అయితే, పంచాంగ కర్తలు ఒకలా చెప్తుండగా, సిద్ధాంతులు, దేవస్థాన పండితులు మరోలా చెప్తున్నారు. అయితే, ఈ విషయమై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గందరగోళం అయితే ఏర్పడింది. ఈ క్రమంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయమై స్పష్టతనివ్వాల్సి ఉంటుంది.
Also Read: కనిపించని శత్రువులే చంద్రబాబుకు ప్రమాదమట?