https://oktelugu.com/

Devotional Tips: లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఇక్కడ పెడితే పట్టిందల్లా బంగారమే… ఎక్కడ పెట్టాలో తెలుసా?

Devotional Tips: ఎవరైనా కోపంగా చిరాకుగా ఉన్నారంటే అలాంటి వారికి ఎదురుగా లాఫింగ్ బుద్ధను పెడితే క్షణాల్లో వారి పెదాలపై నవ్వు వస్తుంది. ఒక్క సారిగా మనకున్న కోపం ఆందోళన మొత్తం తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఏర్పడి మన పెదాలపై చిరునవ్వు తెప్పించే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఎంతో శుభ సూచకంగా భావిస్తారు. ఇలాంటి లాఫింగ్ బుద్దను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 21, 2022 9:48 am
    Follow us on

    Devotional Tips: ఎవరైనా కోపంగా చిరాకుగా ఉన్నారంటే అలాంటి వారికి ఎదురుగా లాఫింగ్ బుద్ధను పెడితే క్షణాల్లో వారి పెదాలపై నవ్వు వస్తుంది. ఒక్క సారిగా మనకున్న కోపం ఆందోళన మొత్తం తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఏర్పడి మన పెదాలపై చిరునవ్వు తెప్పించే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఎంతో శుభ సూచకంగా భావిస్తారు. ఇలాంటి లాఫింగ్ బుద్దను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఇలా ఆర్థిక సమస్యలను తొలగించే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదు.

    ఎంతో పవిత్రమైన ఈ విగ్రహాన్ని మన ఇంటికి ప్రధాన ద్వారం దగ్గర పెట్టకూడదు. ఇంట్లోకి అడుగుపెట్టగానే లాఫింగ్ బుద్ధ విగ్రహం మన కంటికి కనిపించేలా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు తొలగిపోవడమే కాకుండా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.అందుకే అధిక ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఎంతో మంచిది.

    ఇక ఆఫీసులు లేదా వ్యాపారాన్ని చేసే చోట ఈ విధమైనటువంటి లాఫింగ్ బుద్ధ విగ్రహాలు ఉండటం వల్ల వ్యాపారం దినదినాభివృద్ధి జరుగుతుంది. అలాగే నరదిష్టి కూడా తొలగిపోతుంది.మన ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, సంతానం లేని వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది.అందుకే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేలా ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచిది.