Devotional Tips: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజలు చేయకూడదా…. అసలు వాస్తవం ఏమిటి?

Devotional Tips: సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా వ్యక్తులు చనిపోతే ఆ ఇంటిలో ఏడాదిపాటు పూజలు చేయ కూడదనే నియమాన్ని పాటిస్తున్నారు.ఇక మన ఇంట్లో ఎవరైనా పెద్దవారు చనిపోయిన వెంటనే ఇంటికి పెద్దవారు చనిపోయారు కనుక ఏడాదిపాటు ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసిన పూజ కార్యక్రమాలు చేసిన ఎంతో అరిష్టమని భావిస్తూ దేవుడి గదిలో ఉన్న దేవుడు చిత్రపటాలను ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి దాచేస్తారు. అయితే శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు […]

Written By: Navya, Updated On : March 11, 2022 7:19 pm
Follow us on

Devotional Tips: సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా వ్యక్తులు చనిపోతే ఆ ఇంటిలో ఏడాదిపాటు పూజలు చేయ కూడదనే నియమాన్ని పాటిస్తున్నారు.ఇక మన ఇంట్లో ఎవరైనా పెద్దవారు చనిపోయిన వెంటనే ఇంటికి పెద్దవారు చనిపోయారు కనుక ఏడాదిపాటు ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసిన పూజ కార్యక్రమాలు చేసిన ఎంతో అరిష్టమని భావిస్తూ దేవుడి గదిలో ఉన్న దేవుడు చిత్రపటాలను ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి దాచేస్తారు. అయితే శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు పూజలు చేయకూడదా? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

శాస్త్రం ప్రకారం కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏడాది పాటు పూజలు చేయ కూడదనే నియమం ఏ శాస్త్రంలో కూడా లేదు. ఇవన్నీ కేవలం మన అపోహలు మాత్రమేనని శాస్త్రం చెబుతోంది. ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే 11 రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు.11 రోజులు పూర్తి అయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని 12వ రోజు నుంచి ఎదావిధిగా మన పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి అనే నియమం మాత్రమే శాస్త్రంలో ఉంది.

ఇకపోతే పన్నెండు రోజుల తర్వాత ఎదవిదిగా మనం చేసే పూజా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఆలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శించుకోవచ్చు. అయితే ఏ విధమైనటువంటి కొత్త పూజా కార్యక్రమాలు అనగా హోమాలు, అభిషేకాలు వంటి కార్యక్రమాలను చేయించకూడదు. అంతే కానీ ఈ ఏడాది కాలం పాటు పూజాసామాగ్రిని దాచిపెట్టి ఉండటం వల్ల ఆ ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది. ఎక్కడైతే నిత్యదీపారాధన ఉంటుందో అక్కడ సకల దేవతలు కొలువై ఉండి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ కుటుంబాన్ని కాపాడుతారు. అందుకే ప్రతి రోజు దీపారాధన చేయడం ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఏ విధమైనటువంటి అరిష్టం కూడా జరగదు కనుక ఇంట్లో ఎవరైనా చనిపోతే 11 వ రోజు నుంచి దీపారాధన విధిగా చేయడమే నియమం అని శాస్త్రం చెబుతోంది.