మన దేశంలోని ప్రజలు సంతోషంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. రోజూ దీపం పెట్టుకున్నా అశ్వియుజ అమవాస్య రోజు మాత్రం దీపాలను వరుసగా అమర్చుకుంటామనే సంగతి తెలిసిందే. అయితే దీపావళి పండుగ రోజున దీపాలు పెట్టడానికి గల అసలు కారణం మాత్రం చాలామందికి తెలియదు. దీపం పరబ్రహ్మ స్వరూపం కావడంతో పాటు జ్ఞానానికి చిహ్నం. దీపావళి పండుగ రోజున ఏ ఇంట్లో చూసినా దీపాల వరుసలు కనిపిస్తాయి.
దీపాలను వెలిగించడం ద్వారా మనో వికాసం పొందడంతో పాటు అసాధ్యం అనేది దరి చేరదు. నరకాసురుడిని వధించిన శుభ సందర్భం కావడంతో ఈరోజు దీపావళి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. దీపంలో ముఖ్యంగా మూడు రంగులు ఉంటాయి. తెలుగు, నలుపు, వర్ణం ఆ మూడు రంగులు కాగా ఈ మూడు రంగుల వల్ల పసుపు వర్ణం భాసిస్తుంది. శరదృతువులో దీపావళి పండుగ వస్తుందనే సంగతి తెలిసిందే. ఈ కాలంలో సూక్ష్మజీవుల వల్ల విష రోగాలు కలుగుతాయి.
దీపావళి బాణసంచా పొగ వల్ల చిన్నచిన్న సూక్ష్మక్రిములు చనిపోతాయి. భూచక్రాల వల్ల నేలమీద ఉండే క్రిములు చనిపోయి మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది. దీపావళి పండుగ రోజునే కొంతమంది కొత్త సంవత్సరం జరుపుకుంటారు. మనలోని పాపచింతనను తొలగించుకుని ఆత్మజ్యోతిని వెలిగించడమే నిజమైన దీపావళి అని చెప్పవచ్చు.