Devotional Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కాలంతో పాటు పరుగులు పెడుతూ సరైన సమయానికి తిండిలేక సంపాదనలో పడిపోయారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులను చేయడాన్ని పూర్తిగా పక్కన పెట్టారని చెప్పాలి. ఇలాంటి వాటిలో ఇంట్లో పూజ చేయడం ఒకటి. ప్రస్తుత కాలంలో చాలా మంది పని ఒత్తిడి కారణంగా ఉరుకులు పరుగులు పెడుతూ ఇంట్లో పూజా కార్యక్రమాలకు కూడా సమయం కేటాయించలేక పోతున్నారు. ఇలా ఇంట్లో పూజ చేయడానికి సమయం కుదర లేనివారు ఈ పని చేస్తే పూజ చేసిన పుణ్య ఫలం దక్కుతుంది.
సాధారణంగా ప్రతి రోజూ ఉదయం పూజ చేయడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఉదయం ఆఫీసు పనులు మీద హడావిడిగా బయలుదేరుతూ పూజ చేసే సమయం ఉండటం లేదు. ఇలా ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సాయంత్రం కూడా పూజ చేయడం కుదరని వాళ్ళు ప్రతి రోజు పూజ గదిని శుభ్రం చేసి పువ్వులతో అలంకరించి పూజ చేయాల్సిన పనిలేదు. అగరవత్తులు వెలిగించి దేవుడిని స్మరించుకుంటూ చాలు.
అలాగే మార్కెట్లో దొరికే ధూప్ తీసుకువచ్చే దేవుని గదిలో ఉదయం సాయంత్రం ధూపం వేయడం వల్ల మనం పూజ చేసిన పుణ్య ఫలాన్ని పొందవచ్చు.ఇలా ప్రతి రోజు పూజ చేయడానికి కుదరని వాళ్ళు అగరబత్తీలు లేదా దేవుడిని స్మరించుకుంటే సరిపోతుంది అయితే వారంలో ఒక్కసారైనా దేవుడు గదిని శుభ్రం చేసి పూజ చేయడం మంచిదనీ పండితులు చెబుతున్నారు.
Also Read: Telangana State Debt: అప్పుల్లో తెలంగాణ కూడా ఏపీ దారిలోనేనా?
Recommended Videos: