Bendapudi Students: అతిగా వ్యవహరిస్తే ఒక్కోసారి వికటిస్తుంది. మొదటికే మోసం వస్తుంది. లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది. రెండు నెలల కిందట ఏపీ ప్రభుత్వం చేసిన హడావుడి.. వైసీపీ నాయకుల అత్యుత్సాహం వెరసి విద్యార్థులపై తప్పుడు ప్రచారానికి అవకాశమిచ్చింది. ఆ మధ్యన కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వార్తల్లో నిలిచిన విషయం గుర్తుంది కదూ. అనర్గళంగా అమెరికన్ స్లాంగ్ లో ఇంగ్లీష్ గళగళ మాట్లాడి ఏపీ సీఎం జగన్ ద్రుష్టిని ఆకర్షించడంతో పాటు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఏకంగా ఆ విద్యార్థులను పిలిచి సీఎం జగన్ అభినందించారు. విద్యార్థుల ప్రతిభ చూసి జగన్ మురిసిపోయారు. ఒక్కో విద్యార్థిని ప్రత్యేకంగా పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకున్న జగన్.. వారి గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు ఎదురుగా ఉన్నా విద్యార్థులు మాత్రం ఎలాంటి భయం, బెరుకు లేకుండా ధైర్యంగా ఇంగ్లీష్ లో మాట్లాడారు. అయితే దీనిని వైసీపీ రాజకీయ అడ్వాంటేజ్ కు వాడుకుంది. అదంతా వైసీపీ ప్రభుత్వం పుణ్యమేనని ప్రచారం చేసుకుంది. నాడునేడు పథకంతో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే ఇది సాధ్యమైందని వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేసుకుంది. కానీ అప్పటికే ఆ విద్యార్థులకు అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఇంగ్లీష్ లో తర్పీదునివ్వడం వల్లే అక్కడి విద్యార్థులు అమెరికన్ ఇంగ్లీష్ లో ముచ్చటించారని తెలియడం చర్చనీయాంశమైంది.
అయితే ఇప్పుడు అదే బెండపూడి విద్యార్థుల గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ విద్యార్థుల గురించి చర్చ జరుగుతోంది. అదేంటంటే వారు ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఫెయిలయ్యారు అంటూ కథనాలు వినిపిస్తున్నాయి.
Also Read: AP Movie Tickets Issue: ఆన్ లైన్ టికెట్ల ఇష్యూలో ప్రభుత్వం మరో తిరకాసు
కొందరు విపక్ష నేతలు సైతం ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు.ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ఇతర పార్టీల అభిమానులు.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ఫ్యాక్ట్ చెక్ పేరుతో ట్విట్టర్లో పలు పోస్టులను చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వైరల్ అవుతోన్న ఆ వార్తపై క్లారిటీ ఇచ్చింది.
తాజాగా జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్తో అదరగొట్టిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వెల్లడించారు. కావాలనే కొందరు విపక్ష నేతలు సైతం బహిరంగగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ ప్రచారం వెనకాల ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లో భాగంగా బెడంపూడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని మాట్లాడిన వీడియోను, తన మార్కుల జాబితాను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాతో పాటు పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని తేల్చారు.ఇలాంటి అసత్య ప్రచారాలు విద్యార్థులను నైతికంగా దెబ్బతిసేలా ఉన్నాయి అంటూ రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థులకు నెటిజన్లు మద్ధతు కొరుతూ ఓ వెబ్సైట్ లింక్‌ను కూడా పోస్ట్ చేశారు. అందులో తమ అభిప్రాయాలను పంచుకోమని సూచించారు. చాలామంది ఆ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.
Also Read:Renuka Chowdhury: రేణుకా చౌదరి నోటికి, చెయ్యికి ఎప్పుడూ పదునే
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Fact check on fake news circulating about bendapudi students fail in 10th exams
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com