Amazon Prime: కరోనా కల్లోలం మొదలయ్యాక సినీ పరిశ్రమ మూతపడింది. థియేటర్లన్నీ లాక్ డౌన్ తో తెరుచుకోలేదు. దీంతో సినిమాలు, ఎంటర్ టైన్ మెంట్ లేక జనాలు అంతా ఓటీటీ బాటపట్టారు. నాడు అందులో విడుదలైన సినిమాలన్నింటిని చూసేశారు. అలా మొదలైన ఓటీటీ మేనియా ఇప్పుడు మరింతగా విస్తరించింది.. ఈ క్రమంలోనే భారత్ లో ఓటీటీ దిగ్గజాలు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటివి వినూత్న కంటెంట్ తో దేశ ప్రజలను ఆకర్షించాయి. భారీగా రేట్లు తగ్గించడంతో సబ్ స్కైబర్స్ కూడా పెరిగారు.
కరోనా వేళ థియేటర్లో విడుదల కానీ సినిమాలన్నింటిని భారీ రేట్లకు కొని అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. కోట్లు కుమ్మరించి మరీ సినిమాలను కొని డిజిటల్ వేదికగా రిలీజ్ చేసింది. దాంతో అమెజాన్ ప్రైమ్ కు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ టైంలో అమెజాన్ ‘ప్రైమ్’ హవా కొనసాగింది. ఈ టైంలో కొన్ని పెద్ద సినిమాలను.. మిడ్ రేంజ్ సినిమాలను నేరుగా డిజిటల్ రిలీజ్ చేసి అమెజాన్ ప్రైమ్ సంచలనం సృష్టించింది.
Also Read: Zee Telugu Saregamapa 2022: సరిగమప షో: అదిరిపోయిన సింగర్స్, సూపర్ సింగర్స్ జోడీ.. ఎన్నో ఎమోషన్స్
ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన తెలుగు సినిమాలేంటో తెలుసుకుందాం.
1. రాధేశ్యామ్
అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన తెలుగు చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్-పూజాహెగ్డే నటించిన ఈ మూవీ అన్నీ అమెజాన్ ప్రైమ్ సినిమాలను వెనక్కి నెట్టి టాప్ ప్లేసులో కొనసాగుతోంది. థియేటర్లలో మాత్రం ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం విశేషం.
2. పుష్ప
ఇక అల్లు అర్జున్ మాస్ మసాలా పంచిన ‘పుష్ప’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో ఉంది.
3. దృశ్యం2
వెంకటేశ్, మీనా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం2’ మూవీ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది. ఈ మూవీ అత్యధికంగా చూసిన 3వ చిత్రంగా నిలిచింది.
4.జైభీమ్
ఇక సూర్య హీరోగా నటించిన తమిళ మూవీ ‘జైభీమ్’ మూవీ తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ లో వ్యూయర్ షిప్ పరంగా 4వ స్థానంలో ఉంది.
5.టక్ జగదీష్
నాని హీరోగా వచ్చిన ‘టక్ జగదీష్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో వ్యూయర్ షిప్ పరంగా టాప్ 5 స్థానాన్ని దక్కించుకుంది.
6. వకీల్ సాబ్
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా అదరగొట్టిన మూవీ అమెజాన్ ప్రైమ్ లో 3 వారాలకే విడుదలై వ్యూయర్ షిప్ లో 6వ స్థానంలో నిలిచింది.
7. నారప్ప
వెంకటేశ్ హీరోగా వచ్చిన తమిళ డబ్బింగ్ మూవీ ‘నారప్ప’ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన తెలుగు సినిమాల్లో 7వ స్థానంలో ఉంది.
8.ఆకాశం నీ హద్దురా
సూర్య హీరోగా నటించిన ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ మూవీ వ్యూయర్ షిప్ లో 8వ స్థానంలో ఉంది.
9. జాతి రత్నాలు
ఇక ‘జాతిరత్నాలు’ అంటూ తెగ కామెడీ పండించారు నవీన్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ఈ మూవీ వ్యూయర్ షిప్ లో 9వ స్థానంలో నిలిచింది.
10. నిశ్శబ్ధం
అనుష్క నటించిన ఈ మూవీ అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన 10వ మూవీగా ఉంది. అనుష
Also Read: Chiranjeevi-Balakrishna: చిరంజీవి-బాలయ్య మల్టీస్టారర్ మూవీ మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
Recommended Videos: