https://oktelugu.com/

మహేష్ లవ్ ట్రాక్ అదుర్స్ అట !

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. కాగా ఈ సినిమా షూట్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. హీరో హీరోయిన్ల ట్రాక్ ఈ సినిమాలో అద్భుతంగా వచ్చిందట. దూకుడులో మాదిరిగా హీరోయిన్ టీజింగ్ సీన్లతో మాంచి ఫన్ పండిందని తెలుస్తోంది. నిజానికి దర్శకుడు పరుశురామ్ లవ్ ట్రాక్ లను […]

Written By:
  • admin
  • , Updated On : February 11, 2021 / 03:23 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. కాగా ఈ సినిమా షూట్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. హీరో హీరోయిన్ల ట్రాక్ ఈ సినిమాలో అద్భుతంగా వచ్చిందట. దూకుడులో మాదిరిగా హీరోయిన్ టీజింగ్ సీన్లతో మాంచి ఫన్ పండిందని తెలుస్తోంది. నిజానికి దర్శకుడు పరుశురామ్ లవ్ ట్రాక్ లను బాగా రాస్తాడు, మహేష్-కీర్తి ల నడుమ కూడా మంచి ఫన్ సీన్లు రాశాడట.

    Also Read: హైపర్ ఆది పెళ్లి.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

    ఇక ఈ సినిమాలో విలన్ గా మొదట కన్నడ హీరో ఉపేంద్రను అనుకున్నారు. ఉపేంద్ర అయితే బాగుంటుందని మహేష్ కూడా ఫీల్ అయ్యాడు. అయితే సారీ అంటూ ఉపేంద్ర మొత్తానికి మహేష్ సినిమాని అంగీకరించలేదు. మరి విలన్ గా చేయడానికి ఎవరు అంగీకరిస్తారా అనుకుంటున్న సమయంలో తమిళ్ మాజీ హీరో అరవింద స్వామి ఆ పాత్ర చేయడానికి అంగీకరించాడని వార్తలు వచ్చాయి. అలాగే అనిల్ కపూర్ కూడా విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడని టాక్ ఉంది. అయితే అరవింద స్వామికి తెలుగులో కూడా క్రేజ్ ఉంది.

    Also Read: ‘ఆదిపురుష్’ కు పోటీగా ‘రామాయ‌ణ్‌’.. రాముడిగా మ‌హేష్‌.. హ‌న‌మంతుడిగా బ‌న్నీ?

    కాబట్టి.. అటు తమిళ ఇటు తెలుగు కూడా మార్కెట్ పరంగా బాగా గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశ్యంతో అరవింద స్వామిని ఫైనల్ చేశారట. పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో ఆర్ధిక రంగంలోని లొసుగుల వ్యవహరాలకు, సామాజిక అంశాన్ని జోడించి.. పక్కా కమర్షియల్ సినిమాగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో కథానాయకురాలిగా కీర్తి సురేష్ నటించబోతుంది. మరి పరుశురామ్ జీవతంలో వచ్చిన మొదటి పెద్ద ఛాన్స్ ఇది.. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్