Young rebel star Prabhas hero Suriya : సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ స్టార్ హీరోలలో ఒకరు సూర్య..తమిళం లో ఈయనకి ఎంత క్రేజ్ ఉందొ, తెలుగు లో అంతకు మించి క్రేజ్ ఉంది..పాత్ర కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా సిద్దపడే సూర్య కి ఇటీవలే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో అద్భుతమైన నటనని కనబర్చినందుకు గాను అతనికి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చింది..అవార్డ్స్ , రివార్డ్స్ అయితే బాగానే వస్తున్నాయి కానీ,చాలా కాలం నుండి తన రేంజ్ కి తగ్గ సూపర్ హిట్ ని మాత్రం చూడలేకపోయాడు సూర్య.
రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘ET’ అనే చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది..అయితే కమల్ హాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమాలో ‘రోలెక్స్’ పాత్ర ద్వారా ఫ్యాన్స్ అందరిని థ్రిల్ కి గురి చేసాడు సూర్య..ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి సూర్య పోషించిన ‘రోలెక్స్’ పాత్ర..5 నిమిషాల నిడివి ఉన్న పాత్ర తో ఆయన సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గొప్పతనం గురించి..అతను తనకి ఇచ్చిన గౌరవం గురించి చాలా గొప్పగా మాట్లాడుతాడు సూర్య..ఆయన మాట్లాడుతూ ‘ఒక రోజు నా సినిమా షూటింగ్ మరియు ప్రభాస్ సినిమా షూటింగ్ ఒకే చోట జరుగుతుంది..అప్పుడు ఆయన తరుచూ నన్ను కలుస్తూ ఉండేవాడు..ఒకరోజు ప్రభాస్ ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం అన్నాడు..నా కోసం ఎదురు చూస్తుంటానని చెప్పాడు..అయితే ఆరోజు షూటింగ్ నాకు బాగా ఆలస్యం అయ్యింది..ఇక ప్రభాస్ ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు..ప్రొడక్షన్ మెస్ లో తినేసి ఆ తర్వాత ప్రభాస్ కి క్షమాపణలు చెపుదాం అనుకున్నాను..కానీ నేను షూటింగ్ పూర్తి చేసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రభాస్ నన్ను గట్టిగా పిలుస్తూ ‘సార్ నేను సిద్ధంగా ఉన్నాను..మీరు స్నానం చేసి రండి, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం’ అన్నాడు..రాత్రి ప్రభాస్ తినకుండా నాకోసం అంత సేపు ఎదురు చూడడం నాకు చాలా షాకింగ్ గా అనిపించింది..వాళ్ళ అమ్మగారు చేసిన బిర్యాని ని ఇంటి నుండి తీసుకొచ్చాడు ప్రభాస్..అది ఎంతో రుచికరంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్య.