
Senior Heroens: సీనియర్ హీరోయిన్లతో రోమాన్స్ చేసిన కుర్ర హీరోలు.. ఎవరెవరంటే?
సినిమా పరిశ్రమలో హీరోనే కీరోల్. అతడు లేకుంటే అసలు సినిమానే ఉండదు. అలాంటి హీరో పక్కన హీరోయిన్ ఎలా ఉండాలి? చూస్తేనే చూడముచ్చటైన జంట అయ్యిండాలి.. సాధారణంగా హీరోలు అంతా పెద్దవాళ్లుగా మారితే.. వారి పక్కన కుర్ర నునులేత హీరోయిన్లను ఎంపిక చేస్తుంటారు. కథానాయిక వయసు చిన్నగా ఉంటేనే బాగుంటుందని భావిస్తారు. కానీ రానురాను హీరోయిన్లు మాత్రం ముదిరిపోతున్నారు. ఇప్పుడు హీరోలు 50 ఏళ్లు దాటిన వారుంటే వారి పక్కన 30 ఏళ్లలోపు హీరోయిన్లు ఉంటున్నారు. దీంతో వారి మధ్య కెమిస్రీ కుదరడం లేదని తెలుస్తోంది. బాక్సాఫీసు దగ్గర సినిమాలు బోల్తా పడుతున్నాయి. ఎన్టీఆర్ కు మనవరాలుగా నటించిన శ్రీదేవి తరువాత కాలంలో హీరోయిన్ గా అలరించి ఎన్నో హిట్లు కొట్టారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. హీరోయిన్ల వయసే హీరోలకంటే పెద్దగా ఉండడం గమనార్హం.
అక్కినేని అఖిల్ తో జోడి కడుతున్న పూజాహెగ్డే వయసు అఖిల్ కంటే నాలుగేళ్లు పెద్ద. బొమ్మ బ్లాక్ బస్టర్ లో జోడిగా నటిస్తున్న రష్మీ గౌతమ్, నందు లలో రష్మీ వయసు నందు కంటే పెద్ద. రుద్రమదేవిలో జోడిగా నటించిన రానా, అనుష్కల్లో అనుష్క వయసు నాలుగేళ్లు అధికం. కృష్ణ అండ్ హిజ్ లీలాలో సిద్దూ జొన్నలగడ్డ కంటే శ్రద్ధా శ్రీనాథ్ రెండేళ్లు పెద్దది. కవచం, సీత సినిమాల్లో జోడి కట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ కంటే కాజల్ వయసు ఆరేళ్లు అధికం. సాక్ష్యం సినిమాలో కలిసి నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ కంటే పూజా హెగ్డే మూడేళ్లు పెద్దది కావడం తెలిసిందే.
గమనం సినిమాలో కలిసి నటించిన ప్రియాంక జునాల్కర్ కంటే శివ కందకూరి రెండేళ్లు చిన్న. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. దడ సినిమాలో నాగచైతన్యకు జోడిగా టించిన కాజల్ ఏడాది పెద్ద. మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించారు. విజయ్ కంటే సమంత వయసు రెండేళ్లు పెద్ద. వంశీ సినిమాలో నటించిన మహేశ్ బాబు, నమ్రత లో మహేశ్ బాబు కంటే నమ్రత మూడేళ్లు పెద్ద కావడం విశేషం. వీరిద్దరూ కూడి తర్వాత వివాహం చేసుకోవడం విశేషం.
ఇక మహేశ్ బాబు మొదటి సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రీతిజింటా వయసు ఆయనకంటే కొన్ని నెలలు పెద్ద. నానిలో మహేశ్ బాబుకు జోడిగా నటించిన అమీషా పటేల్ ఆయనకంటే కొన్ని నెలలు ఎక్కువ అని తెలుస్తోంది. మురారిలో కూడా జంటగా నటించిన సోనాలి బింద్రే ఎనిమిది నెలలు పెద్దది కావడం తెలిసిందే. సింహాద్రి, సాంబ సినిమాల్లో జోడిగా నటించిన భూమిక చావ్లా ఎన్టీఆర్ కంటే ఐదేళ్లు పెద్దది కావడం విశేషం.
ఇంకా ఎన్టీఆర్ ‘నా అల్లుడు’లో జంటగా నటించిన శ్రీయ ఆయనకంటే ఒక సంవత్సరం పెద్దది కావడం తెలిసిందే. నరసింహుడు లో జోడిగా నటించిన అమీషా పటేల్ ఎన్టీఆర్ కంటే దాదాపు ఏడేళ్లు పెద్దది కావడం విశేషం. ఇందులోనే నటించిన మరో హీరోయిన్ సమీరా రెడ్డి కూడా ఆయనకంటే ఐదేళ్లు పెద్ద కావడం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడిన సంగతి విషయం విధితమే.
ఇలా వయసులో పెద్దవారితో హీరోలు జత కడుతున్నారు. కానీ సినిమా మాత్రం విజయం సాధించలేకపోతోంది. పెద్ద హీరోయిన్లతో చేసిన హీరోలకు పెద్ద దెబ్బలే తగిలాయి. హీరోలకంటే తక్కువ వయసు ఉన్న అందమైన భామలు ఇప్పుడు దొరకడం లేదు. దీంతో వయసు ఎక్కువైనా సరే జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు. వారి ఫాలోయింగ్, అభినయం కోసం తీసుకోక తప్పడం లేదు. ఫలితంగా సినిమా విజయం సాధించలేకపోతోంది. నిర్మాతలకు మాత్రం ఇది చేదు అనుభవమే మిగిలిస్తోంది.