Tollywood: స్టార్ హీరోయిన్ సరసన ఛాన్స్ కొట్టేసిన నవీన్ పోలిశెట్టి…

Tollywood: స్టార్ హీరోయిన్ అనుష్క గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత వచ్చిన విక్రమార్కుడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనుష్కకు ఆఫర్లు క్యూకట్టాయి. స్టార్ హీరోల సరసన వరస చిత్రాలలో నటించి టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి ఎదిగింది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి… ప్రస్తుతం మరో మూవీకి […]

Written By: Raghava Rao Gara, Updated On : December 26, 2021 2:37 pm
Follow us on

Tollywood: స్టార్ హీరోయిన్ అనుష్క గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత వచ్చిన విక్రమార్కుడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనుష్కకు ఆఫర్లు క్యూకట్టాయి. స్టార్ హీరోల సరసన వరస చిత్రాలలో నటించి టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి ఎదిగింది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి… ప్రస్తుతం మరో మూవీకి సిద్ధమవుతోంది. గత ఏడాది నిశ్శబ్దం సినిమాతో నిరాశ పరిచిన… ఈసారి మాత్రం సాలిడ్ హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తుంది. క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 14 పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ”రారా కృష్ణయ్య’ ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. కాగా ఇంకా ఈ సినిమాకు టైటిల్ ను అనౌన్స్ చేయలేదు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్ వదిలింది. ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి కూడా నటించనున్నత్లౌ తెలుస్తుంది. ఈ మేరకు నవీన్ పొలిశెట్టి ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. నేడు నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సంధర్భంగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడనే ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని… వయసులో దాదాపు ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడం… వాళ్లు ఎదుర్కొనే పరిమాణాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. నవీన్ పోలిశెట్టికి కెరీర్ ఆరంభంలోనే అనుష్క లాంటి హీరోయిన్ తో కలిసి నటించే ఛాన్స్ రావడమంటే విశేషమనే చెప్పాలి.