https://oktelugu.com/

Shyam Singha Roy: అదిరిపోయే కలెక్షన్లు రాబడుతున్న ‘శ్యాం సింగ రాయ్’

Shyam Singha Roy Collections: న్యాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం ‘శ్యాం సింగ రాయ్’. రెండ్రోజుల ముందే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తూ ‘జెర్సీ’ తర్వాత నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా మారేలా కన్పిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 22కోట్ల మేరకు బిజినెస్ చేసింది. గత రెండురోజ్లులో ఈ మూవీ రూ.12.81 కోట్లు వసూళ్లను చేసింది. బ్రేక్ ఈవెంట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2021 / 02:00 PM IST
    Follow us on

    Shyam Singha Roy Collections: న్యాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం ‘శ్యాం సింగ రాయ్’. రెండ్రోజుల ముందే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తూ ‘జెర్సీ’ తర్వాత నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా మారేలా కన్పిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 22కోట్ల మేరకు బిజినెస్ చేసింది.

    Shyam Singha Roy

    గత రెండురోజ్లులో ఈ మూవీ రూ.12.81 కోట్లు వసూళ్లను చేసింది. బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ.22.50 కోట్లు ఉండగా మరో రూ. 9.69 కోట్లు సాధిస్తే ఈ సినిమా హిట్ సాధించనట్లే లెక్క. దీంతో గత రెండ్రోజుల్లో ఈ మూవీకి ఎక్కెడక్కడ ఎంత కలెక్షన్లు సాధించిందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

    ‘శామ్ సింగ రాయ్’ హక్కులను నైజాంలో 8కోట్లకు, సీడెడ్లో 2.50కోట్లు, ఆంధ్రాలో 6కోట్ల ధర పలికింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలో 16.50కోట్ల బిజినెస్ జరుగగా రెస్టాఫ్ ఇండియాలో రెండు కోట్లు, ఓవర్సీస్ లో మూడున్నర కోట్లు ధర పలికింది. దీంతో మొత్తంగా ఈమూవీ విడుదలకు ముందు 22కోట్ల మేర బిజినెస్ చేసి పర్వాలేదనిపించింది.

    మొదటిరోజున ‘శ్యాం సింగ రాయ్’ మూవీకి నైజాంలో 2.21కోట్లు, సీడెడ్లో 65లక్షలు, ఉత్తరాంధ్రలో 52లక్షలు, గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణాల్లో 15లక్షల పైబడి కలెక్షన్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 4.48కోట్ల షేర్ సాధించగా గ్రాస్ కలెక్షన్లు 7.12కోట్లు వచ్చాయి.

    మొదటి రోజు తర్వాత సినిమాకు మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతో రెండోరోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. రెండోరోజు నైజాంలో 4.33 కోట్లు, సీడెడ్‌లో 1.27 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.03 కోట్లురాగా ఓవరాల్ గా రెండు రాష్ట్రాల్లో 8.56 కోట్లు షేర్ రాగా 14.02 కోట్ల గ్రాస్ వచ్చింది. రెస్టాఫ్ ఇండియాలో 1.95 కోట్లు, ఓవర్సీస్‌లో 2.30 కోట్లు వచ్చాయి.

    ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రెండు రోజుల్లోనే 12.81 కోట్లు షేర్‌తోపాటు 22.50 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.మరో 9.69కోట్లు సాధిస్తే ఈ మూవీ హిట్ సినిమాగా నిలువనుంది. ఇక మొదటి రోజు కంటే రెండోరోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో ‘శ్యాం సింగ రాయ్’ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

    ఈ మూవీలో నానికి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నటించారు. రాహుల్ సంకృత్యన్ సినిమాను తెరకెక్కించగా మిక్కిజే మేయర్ సంగీతం అందించాడు. మొత్తంగా ‘శ్యామ్ సింగ రాయ్’ అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ హిట్ దిశగా వెళుతుండటంతో నాని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.