BalaKrishna : నందమూరి నటసింహాం గా ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న బాలయ్య బాబు తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మిగతా హీరోలందరితో తనను సపరేట్ చేసి చూసేలా చేసుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు నుంచి వచ్చిన కమర్షియల్ సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇప్పటికే ఆయన వరుసగా నాలుగు విజయాలను సాధించి ఫామ్ లో ఉన్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక బోయపాటితో చేస్తున్న అఖండ 2 (Akhanda 2) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద వరుసగా రెండు సినిమాలు తీసి సూపర్ సక్సెస్ లను అందుకున్న వెంకీ అట్లూరి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ డైరెక్టర్ బాలయ్య బాబుకి ఒక కథను కూడా వినిపించారట. ఇక బాలయ్య కూడా ఆయన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
అయితే బౌండెడ్ స్క్రిప్ట్ ను తయారు చేసుకోవడంలో వెంకీ అట్లూరి బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఒకవేళ ఈ సినిమా కనక పట్టాలెక్కితే మాత్రం వెంకీ అట్లూరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక బాలయ్య బాబు ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడా? యాక్షన్ ఎపిసోడ్స్ లో గాని ఆయన నటనలో గాని కొత్తదనాన్ని తీసుకురావాలని ఉద్దేశ్యంతోనే వెంకీ అట్లూరి ఒక అదిరిపోయే కథనైతే బాలయ్య కు వినిపించారట. మరి అది ఏ జానర్లో రాబోతుంది ఎలాంటి పాత్రతో వస్తున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం వెంకీ అట్లూరి ధనుష్ తో గాని సూర్యతో గాని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమా కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…చూడాలి మరి వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…