https://oktelugu.com/

Chiranjeevi :  చిరంజీవి సూపర్ హిట్ సినిమాకి ఎల్ బి శ్రీరామ్ డైలాగ్స్ రాశాడనే విషయం మీకు తెలుసా..?

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరు మూస ధోరణిలో సినిమాలు చేస్తూ ఉండేవారు. కానీ మెగాస్టార్ చిరంజీవి వచ్చిన తర్వాత సినిమా తీసే స్టైల్ గాని, ప్రేక్షకుడు సినిమా చూసే స్టైల్ ను కూడా మార్చేశాడు. ఇక బ్రేక్ డాన్స్ లతో భారీ ఫైట్లతో విధ్వంసాలను సృష్టిస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న చిరంజీవి అతి తక్కువ సమయంలోనే మెగాస్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : February 8, 2025 / 02:14 PM IST
    Chiranjeevi

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi :  చిరంజీవి హీరోగా వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి. ఆయన దాదాపు 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. అందువల్లే ఆయనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. మరి ఇదిలా ఉంటే ఒకానొక సందర్భంలో ఆయనకు చాలా వరకు ఫ్లాప్ సినిమాలైతే వచ్చాయి. ఇక ప్లాపు ల నుంచి తనను తాను గట్టెక్కించుకోవడానికి హిట్లర్ (Hitler)అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాని ముత్యాల సుబ్బయ్య (Mutyala Subbaiah) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేయడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో రైటర్ కోసం వెతుకుతున్న సందర్భంలో ముత్యాల సుబ్బయ్య ఎల్బీ శ్రీరామ్ ను ఈ మూవీకి డైలాగ్ రైటర్ గా తీసుకున్నాడు. నిజానికి ఎల్బీ శ్రీరామ్ మనందరికీ నటుడిగా బాగా పరిచయం కానీ ఇంతకుముందు ఆయన రైటర్ గా ఇండస్ట్రీలో తన మనుగడను కొనసాగించేవాడు. ఎన్నో మంచి సినిమాలకు మాటలు కూడా అందించాడు. ముఖ్యంగా ఇవివి సత్యనారాయణ చేసిన హలో బ్రదర్, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు లాంటి సినిమా లకు రైటర్ గా వ్యవహరించి ఆ తర్వాత ఇవివి తీసిన ‘చాలా బాగుంది’ సినిమాతో నటుడిగా మారిపోయాడు.

    మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్న ఎల్బి శ్రీరామ్ హిట్లర్ సినిమాకి డైలాగులు రాయడంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారట. ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ అనేది పడిపోకుండా చాలా చక్కని మాటలతో డైలాగులు రాస్తూ చిరంజీవి ఇమేజ్ ను రెట్టింపు చేసే విధంగా ఉండేలా తీర్చిదిద్దాడట.

    మరి ఏది ఏమైనా కూడా ఎల్బీ శ్రీరామ్ టాప్ రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాక నటుడిగా మారి కమెడియన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం…

    ఆయనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంది. ఆ స్టైల్ కోసం చాలామంది అభిమానులు ఆసక్తిగా ఆయన సినిమాలను చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కూడా ఆయన కొన్ని సినిమాల్లో నటిస్తూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం…