Director Athreya: సినిమా ఫీల్డ్ లో అవకాశాలు అనేవి అదృష్టం లాంటివనే చెప్పాలి. ఎప్పుడు ఎవరి ఫేమ్ ఎలా మారుతుందో చెప్పడం ఎవరి తరం కాదు. ఇక యువ డైరెక్టర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు పెద్ద హీరోలతో డైరెక్ట్ చేయాలంటే చాలా టైమ్ పట్టేది. కానీ ఇప్పుడు యువ దర్శకులు ఒకటి లేదా రెండు సినిమాలతోనే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఇప్పుడు భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర లక్ కూడా ఇలాగే ఉంది.
ఈయన రాజేంద్ర ప్రసాద్ తో అయ్యారే, శ్రీ విష్ణుతో అప్పట్లో ఒకడుండే వాడు అనే మూవీలు తీశాడు. అయితే ఈ ఎండు మంచి సక్సెస్ సాధించాయి. దీంతో అతను త్రివిక్రమ్ కంట్లో పడ్డాడు. భీమ్లానాయక్ విషయంలో ప్రతీదీ త్రివిక్రమ్ ఫైనల్ చేస్తున్నాడు. ప్రతి విషయంలో త్రివిక్రమ్ సలహాలు తీసుకుంటున్నాడు పవన్. అయితే ఈ మూవీని ముందుగా మరో యంగ్ డైరెక్టర్‌కు అప్పగించాలని అనుకున్నాడంట త్రివిక్రమ్.
Also Read: ‘భీమ్లానాయక్’కి U/A.. పైగా కేటీఆర్ కూడా రాబోతున్నాడు
వాస్తవానికి ఇందులో ఇద్దరు హీరోలు ఉండటంతో.. వారిని సమానంగా చూపించడం ఒక డైరెక్టర్‌కు పెద్ద సవాల్. సీనియర్ డైరెక్టర్లు అయితేనే దాన్ని హ్యాండిల్ చేయగలరు. కానీ త్రివిక్రమ్ ఓ యంగ్ డైరెక్టర్‌ను ఈ విషయంలో నమ్మాడు. అతనే వివేక్ ఆత్రేయ. ఇతగాడు తీసిన బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి.
వాటిని చూసిన త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టును అతని చేతుల్లో పెట్టాలని అనుకున్నాడు. కానీ అతను అప్పటికే నేచురల్ స్టార్ నానితో సినిమాకు కమిట్ అయ్యాడు. పైగా మైత్రీ మూవీ మేకర్స్ ఇందుకోసం అతనికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ఆ సినిమానే అంటే.. సుందరానికి. ఒకసారి కమిట్ మెంట్ ఇచ్చాక ఏం చేయలేరు కాబట్టి.. ఆత్రేయ ఈ భీమ్లా నాయక్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కోల్పోయాడు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీని హడలెత్తిస్తున్న భీమ్లానాయక్‌ను మిస్ చేసుకున్నందుకు వివేక్ ఆత్రేయ చాలా ఫీల్ అయ్యాడని తెలుస్తోంది.
Also Read: తల్లి పాత్రలు చేసే సీనియర్ హీరోయిన్లు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా..?
Recommended Video: