https://oktelugu.com/

Bheemla Nayak: ‘భీమ్లానాయక్’కి U/A.. పైగా కేటీఆర్ కూడా రాబోతున్నాడు

Bheemla Nayak: పవర్స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. సినిమాకు సెన్సార్ పూర్తయినట్లు వెల్లడించింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితారా ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. ఇక భీమ్లా నాయక్ సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. అలాగే ఈ భారీ మల్టీస్టారర్ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 19, 2022 / 03:01 PM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. సినిమాకు సెన్సార్ పూర్తయినట్లు వెల్లడించింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితారా ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. ఇక భీమ్లా నాయక్ సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

    Pawan Kalyan and Rana Daggubati in Bheemla Nayak

    అలాగే ఈ భారీ మల్టీస్టారర్ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 21న హైదరాబాద్ లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి ముఖ్య అతిథి లేకుండానే ఈ కార్యక్రమం నిర్వహించాలని చిత్ర యూనిట్ తొలుత ప్లాన్ చేయగా.. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుందట. తెలంగాణ మంత్రిని ముఖ్య అతిథిగా పిలిచినట్లు తెలుస్తోంది.

    Also  Read:  కేసీఆర్ సార్ మేడారం రాకపోయే.. విమర్శల జడివాన మొదలాయే!

    ఆ ముఖ్యఅతిథి ఎవరో తెలుసా ? తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 21న నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఈవెంట్‌ లో కేటీఆర్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

    Minister KTR

    ఇక సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్,రానా కాంబినేషన్‌లో రూపొందిన ఈ ”భీమ్లా నాయక్’ పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్ యాక్షన్ కూడా అద్భుతంగా ఉంటుందట. ఇక ఈ సినిమా కోసం థమన్ బెస్ట్ మ్యూజిక్ అందించాడట.

    Also  Read: మ‌హేశ్ బాబు ఖాతాలో కొత్త యాడ్‌.. వీడియో హాలివుడ్ రేంజ్‌లో ఉందిగా..!

    Tags