War 2 Overseas Release: ఎన్టీఆర్(Junior NTR),హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం మరో 16 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో ఈ ట్రైలర్ లో ప్రదర్శించారు కూడా. రెస్పాన్స్ అదిరిపోయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ ని మూడు రోజుల క్రితమే ప్రారంభించారు. సుమారుగా 600 కి పైగా షోస్ షెడ్యూల్ చేయగా, ఆ షోస్ నుండి 13 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ 13 వేల గ్రాస్ లో కూడా సగం హిందీ వెర్షన్ కి సంబంధించినవే ఉంటాయి. ఎన్టీఆర్ రేంజ్ కి ఇది చాలా అంటే చాలా తక్కువ వసూళ్లు అనుకోవచ్చు.
Also Read: మహేష్ బాబు ‘హరి హర వీరమల్లు’ కథని రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా!
ఇది హిందీ డబ్బింగ్ సినిమా కదా, అందుకే తెలుగు వెర్షన్ ని అంతగా ఆడియన్స్ పట్టించుకోవడం లేదు అనేది ఆడియన్స్ వాదన. చిన్న హీరోల సినిమాలకు అయితే ఇలాంటి సాకులు వర్తిస్తాయి కానీ, ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోలకు వర్తించవు, హిందీ సినిమా అయితే ఏమి?, అందులో నటించింది ఎన్టీఆర్ కదా, మన తెలుగు స్టార్ హీరో సినిమా అంటే థియేటర్ కి కదలకుండా ఉంటామా?, కాకమ్మ కబుర్లు చెప్పకండి అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ని నార్త్ అమెరికా లో మొదలు పెట్టిన అతి తక్కువ సమయం లోనే 5 లక్షల 55 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘వార్ 2’ విడుదల అయ్యే రోజునే ఈ సినిమా కూడా విడుదల కాబోతుంది.
Also Read: ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను తిట్టిన ఆ స్టార్ హీరోనే ఇప్పుడు ఆయన మూవీలో విలన్ గా చేస్తున్నాడా..?
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘కూలీ’ తెలుగు వెర్షన్ నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే 90 వేల డాలర్లను దాటేసింది. కూలీ లో వార్ 2 ఇప్పటి వరకు పావు శాతం అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా నమోదు చేసుకోలేదు. దీనిని బట్టీ ఈ సినిమాకి ఓవర్సీస్ లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడం వల్లనో, ఏమో తెలియదు కానీ, మేకర్స్ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తాన్ని ఆపేసారు. ఈ నెల 31 నుండి మళ్ళీ తిరిగి ప్రారంబిస్తారట. ఎందుకంటే ఆ సమయం లో అందరికీ జీతాలు వస్తాయి కాబట్టి, అప్పుడు ప్రారంభించడమే బెటర్ అనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. మరోపక్క ఈ అంశంపై సోషల్ మీడియా లో ట్రోల్స్ వేరే లెవెల్ లో నడుస్తున్నాయి.