Rajinikanth Remuneration: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటుడు రజనీకాంత్…ఆయన తమిళంలో స్టార్ హీరో అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా తమిళ తో పాటు తెలుగులో కూడా డబ్ అవుతుండడంతో ఇక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు చాలా మంది అతని సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే గతంలో వచ్చిన ‘జైలర్’ సినిమాతో 400 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు మరోసారి ‘జైలర్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సంవత్సరం చేసిన కూలీ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు… ఇప్పుడు ‘జైలర్ 2’ సినిమాతో ఆయన ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం రజనీకాంత్ దాదాపు 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఏ సీనియర్ హీరో కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయలేదు. చిరంజీవి సైతం 50 కోట్ల వరకు రెమ్యూనికేషన్ తీసుకుంటున్నాడు. కానీ రజనీకాంత్ మాత్రం 60 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయడం అనేది మామూలు విషయం కాదు… ఎంతైనా రజనీకాంత్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అతనికి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది.
అందువల్లే అతను అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు సైతం వెనకాడటం లేదు అంటూ తమిళ్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమాతో తనను తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక తనకి హెల్త్ సపోర్ట్ చేయకపోయిన కూడా అభిమానుల కోసం సినిమాలను చేస్తున్నాడు. కాబట్టి తన సినిమాల్ని అన్ని భాషల ప్రేక్షకులు చూసి విజయవంతం చేస్తారనే కాన్ఫిడెంట్ తో రజనీకాంత్ ఉన్నాడు…చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తోంది అనేది…