https://oktelugu.com/

Photo Story: ఇండస్ట్రీని ఏలుతున్న ఈ కుర్రాడి స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు.. ఎవరో చెప్పుకోండి..

ఇప్పటికీ అంతే స్మార్ట్ నెస్ తో ఆకట్టుకుంటున్నా ఆ హీరో నేటి కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నాడు. అయితే ఆ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? ఒకవేళ గుర్తుపట్టకపోతే వెంటనే తెలుసుకోండి..

Written By:
  • Neelambaram
  • , Updated On : August 23, 2023 / 07:08 PM IST
    Follow us on

    Photo Story: దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఓ హీరో చిన్న నాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అభిమాని దానిని అప్లోడ్ చేశాడు. ఆయన బర్త్ డే సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ కుర్రాడు ఎంతో అందంగా ఉన్నాడు. ఇప్పటికీ అంతే స్మార్ట్ నెస్ తో ఆకట్టుకుంటున్నా ఆ హీరో నేటి కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నాడు. అయితే ఆ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? ఒకవేళ గుర్తుపట్టకపోతే వెంటనే తెలుసుకోండి..

    1980 ల కాలంలోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆగస్టు 22న జన్మించిన శివశంకర వరప్రసాద్ (చిరంజీవి)కి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. దీంతో చదువు పూర్తి చేసుకొని 1976లో చెన్నైకి పయనమయ్యాడు. అక్కడ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఫీల్డులోకి అడుగుపెట్టాడు. అయితే ఎన్నో కష్టాలు పడ్డాక చిరంజీవికి మొదటిసారి ‘ప్రాణం ఖరీదు’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత 1978లో ‘పునాది రాళ్లు’ అనే సినిమాతో హీరోగా మారారు.

    బాపు డైరెక్షన్లో వచ్చిన ‘మనవూరి పాండవులు’ సినిమాతో చిరంజీవి ఆడియన్స్ కు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఇది కథకాదు, రాణీ కాసుల రంగమ్మ వంటి చిన్న పాత్రల్లో నటించాల్సి వచ్చింది. అయితే 1980లో ‘మొగుడు కావాలి’ అనే సినిమా ద్వారా కాస్త గుర్తింపు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతోపాటు సిల్వర్ జూబ్లి వేడుకలు నిర్వహించుకుంది. ఆ తరువాత ‘తిరుగులేని మనిషి’లో ఎన్టీఆర్ తో కలిసి చిరంజీవి నటించారు. ఇక ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాతో చిరంజీవి మాస్ హీరోగా మారారు.

    ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి మెగాస్టార్ వరకు ఎదిగారు. ఇప్పటికీ హీరోగా నటిస్తూ అలరిస్తున్నారు. ఆయన సినీ కెరీర్లో ఎన్నో విజయాలు, అవార్డులు వచ్చాయి. అయితే ఇటీవల చిరంజీవి బర్త్ డేసందర్భంగా ఆయన చిన్న నాటి ఫొటో బయటకు వచ్చింది. ఇందులో ఆయన ఇద్దరు తమ్ముళ్లు నాగేంద్ర బాబు, పవన్ కల్యాణ్ ఉన్న ఈ ఫొటోను ఓ అభిమాని పోస్టు చేయగా అది వైరల్ అవుతోంది.